శ్రీ సరస్వతీ విద్యాపీఠం - అర్చన - 07. భోజన మంత్రం - Sri Saraswati Vidya peetham
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ సరస్వతీ విద్యాపీఠం - అర్చన - 07. భోజన మంత్రం - Sri Saraswati Vidya peetham

P Madhav Kumar
1. ఓం బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్| 
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా॥

2. ఓమ్ సహనావవతు। సహ నౌ భునక్తు। 
సహవీర్యం కరవావహై| తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై॥

ఓమ్ శాంతిశ్శాంతిశ్శాంతిః

భావము : అర్పణ చేయడము బ్రహ్మము. అర్పించబడిన వస్తువు బ్రహ్మము. ఆ వస్తువును స్వీకరించు అగ్ని బ్రహ్మము. ఇచ్చెడి యజమానుడు బ్రహ్మము. అంతా బ్రహ్మస్వరూపమైన ఈ క్రియ ద్వారా చేరుకొనవలసినది కూడా బ్రహ్మమునే!


మనమిరువురము (గురువు-శిష్యుడు) పరస్పరము కలిసి రక్షించు కొందము. కలసిమెలసి భుజించెదము, మనము కలసి శౌర్యము ప్రకటించెదము. మన అధ్యయనము ఉజ్జ్వలమై వెలుగొందును గాక. పరస్పరము ద్వేషములేకుండా ఉందుముగాక, మూడు విధములైన శాంతి (ఆదిభౌతిక, ఆధ్యాత్మిక, ఆదిదైవిక) నెలకొనుగాక.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow