ధ్యాన శ్లోకం:
1. ఓం పూర్ణమదః పూర్ణమిదం - పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ - పూర్ణమేవా వశిష్యతే॥
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః ॥
భావము : ఈ సృష్టి అంతయు భగవంతునిచే నిండియున్నది. కాబట్టి ఈ సృష్టికి యేమి కలిపిననూ, సృష్టినుండి దేనిని తీసివేసిననూ ఏ విధమైన మార్పురాదు. నశించునది నశించుచుండగా మరొక చోట, మరొకవైపు నూతనముగా సృష్టించబడుచుండును. భగవత్ స్వరూపమైన ఈ సృష్టి అనంతమైనది, అవ్యయమైనది. అది ఎప్పటికినీ పరిపూర్ణముగానే ఉండును.
2. స్నానం చేసేటప్పుడు
గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతినర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు||
భావము : గంగా, యమునా, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి మొదలగు పుణ్యనదులన్నింటి జలము నా యీ స్నానము చేయు నీటిలో చేరి, నన్ను పవిత్రము చేయుగాక!

3. విఘ్నేశ్వర స్తుతి
ఏక దంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్లంబోదరం విశాలాక్షం వందేహమ్ గణనాయకమ్||
భావము : ఏకదంతుడు, మహాకాయుడు, జ్వలిస్తున్న సువర్ణంతో సమానమగు కాంతి కలవాడు, లంబోదరుడు, విశాలమైన కన్నులు కలవాడు, ప్రమధగణాలకు నాయకుడు అయిన ఆ వినాయకునికి నేను నమస్కరిస్తున్నాను.

4. త్ర్యంబకాదేవి స్తుతి
సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికేశరణ్యే త్య్రంబకే దేవి నారాయణి నమోస్తుతే!
భావము : అన్ని శుభ కార్యములకు శుభమును చేకూర్చే, సర్వకార్యములను సాధించే అందరికీ శరణ్యమైన, ముక్కంటి పత్నియైన పార్వతీదేవీ! నీకు నమస్కారములు.

5. మృత్యుంజయ మహామంత్రం
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనమ్ఉర్వారుక మివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్||
భావము : ముక్కంటివాడు, సుగంధ భరితుడు మరియు ఐశ్వర్యాలను ప్రసాదించువాడిని నేను పూజిస్తాను. ఓ పరమేశ్వరా! మృత్యువు నుండి నన్ను దూరం చేయుము.

6. శ్రీరామ స్తుతి:
ఆపదా మప హర్తారం దాతారం సర్వసంపదాం।లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ॥
భావము : కష్టాలను తొలగించి, సర్వసంపదలను ప్రసాదించే లోకాభిరాముడగు శ్రీరాముడికి మనసారా నమస్కరిస్తున్నాను.

7. తులసీ పూజ:
యన్మూలే సర్వ తీర్థాని యన్మధ్యే సర్వ దేవతా
యదగ్రే సర్వ వేదాశ్చ తులసీం త్వాం నమామ్యహమ్ ||
భావము : తులసి చెట్టు యొక్క వేర్లలో సర్వ తీర్థాలు, మధ్య భాగంలో సర్వ దేవతలు, పై భాగంలో సర్వ వేదాలు ఉంటాయి. అట్టి ఓ తులసీ మాతా! నీకు నమస్కరిస్తున్నాను.

8. శమీ వృక్ష స్తుతి:
శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియ దర్శినీ॥
భావము : శమీ వృక్షం పాపాలను తొలగిస్తుంది. శత్రునాశనం చేస్తుంది. ఈ వృక్షంలో ధనుర్ధారియగు అర్జునున్ని, మర్యాదా పురుషోత్తముడగు శ్రీరామచంద్రున్ని దర్శించుకొంటాను.

9. పిడుగు పడకుండుటకు పఠించునది:
అర్జునః ఫల్గునః పార్థః కిరీటి శ్వేతవాహనఃబీభత్సో విజయః కృష్ణః సవ్యసాచీ ధనంజయః॥
భావము : పిడుగుపాటు సమయంలో ఇంద్రుని కుమారుడైన అర్జునుని పది పేర్లను తలచుకొనుట ద్వారా ప్రమాదములను నివారించుకొనవచ్చునని మన ప్రజల విశ్వాసము.

10. నిదప్రోయేముందు:
రామం స్కంధం హనూమంతం వైనతేయం వృకోదరంశయనే యః స్మరేన్నిత్యం దుస్స్వప్నః తస్య నస్యతి
భావము : రాముడు, కార్తికేయుడు, హనుమంతుడు, గరుత్మంతుడు, భీముడు మొదలగు వారిని నిత్యము నిద్రించుటకు ముందు స్మరించిన వారికి చెడు స్వప్నములు కలుగవు.

11. మంగళం
మంగలం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే *చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్ ||
భావము : సర్వ భూమండలానికి చక్రవర్తియు, ఉన్నతమైన గుణములు కలిగినవాడునగు శ్రీరామచంద్రునికి మంగలమగుగాక!

12. స్వస్తి వచనం
ఓం సర్వేషాం స్వస్తిర్భవతు - సర్వేషాం శాంతిర్భవతు
సర్వేషాం మంగలం భవతు - సర్వేషాం పూర్ణం భవతు||
భావము : అందరికి శుభమగుగాక! అందరికి శాంతి కలుగుగాక! అందరికీ మంగళమగు గాక! అందరికీ సుఖము ప్రాప్తించుగాక! అందరికీ శాంతి కలుగు గాక!

13. జన్మదిన ఆశీర్వాదం
జన్మదినమిదం అయి ప్రియా సఖే
శంతనోతు తే సర్వదా ముదం
ప్రార్థయామహే భవ శతాయుషీ
ఈశ్వరస్సదా త్వాం చ రక్షతు
పుణ్యకర్మణా కీర్తిమార్జయ
జీవనం తవ భవతు సార్థకం
శతమానం భవతి, శతాయుః పురుషశ్శతేంద్రియ, ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి.