విద్యావాసనలు అనే బీజములతో నిండినటువంటిమాయారూప బీజాపూర ఫలము ఒక చేతను, ఆ విద్యా కార్యమస్తకభేది, విద్యారూప గదను,వ ఎనస్సు అనే చెఱకు విల్లును, త్రిపుటీరూప త్రిశూలమును సంసారరూపమనే చక్రమును, అజ్ఞానమును నిద్రనుండి వేల్కొలుపుటకు మోగించు శంఖమును, రాగరూపపాశమును, శుద్ధ జ్ఞానం వల్ల వికసించిన హృదయ రూప ఉత్పలమును,
జీవులకు మహదానందం కలిగించే వడ్లకంకిని, ఖండ జ్ఞానరూప భిన్నదంతమును, జ్ఞానవిజ్ఞాన రత్నపూరితి అమృత కలశమును, తన పది చేతులయందు మరియు తొండముతోనూ ధరించినవాడు మహాగణపతి.
మాయాకార నర శరీరమూ కంఠానికి దిగువ ప్రదేశములోనూ, పురుషాకార గజవదనం, కంఠప్రదేశానికి ఉపరిభాగమున రూపంగా కలిగినవాడు,
జాగ్రత్ స్వప్న సుషుప్తి అనే మూడు ప్రపంచాలకు సాక్షీభూతమైన త్రినేత్రం కల్గినవాడు, బ్రహ్మశక్తి రూపమైన సిద్ధ లక్ష్మిని ఆలింగనం చేసుకుంది. శ్రీ మహాగణపతి రూపం. ప్రపంచసృష్టి, స్థితి, లయకారుడు అష్టపురి అనే ఈ శరీరంలో వుండేవాడు, శ్రీమహాగణపతి యెక్క సగుణ రూపం.
వైష్ణవ వినాయకుడు
శివుణ్ణి ఆరాధించేవాళ్ళంతా ప్రతి కార్యక్రమ ప్రారంభంలో పూజించే వినాయకుణ్ణి 'గణపతి' అని పిలుస్తారు.
అదే గణపతిని విష్ణువునారాదించే వైష్ణవులంతా "విష్వక్సేను"డని పిలుస్తారు. ఇద్దరూ ఒకరే. పేరులో మార్పే.
"యస్య ద్విరద వక్త్రద్యా: పారిషద్యాః పరశ్శతం! విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే ||”
విఘ్నాన్ని ఏ మాత్రమూ రానీయకుండా వందలకొలదీ గజముఖులు ఏ ప్రదేశంలో నిరంతరం కాపుదలగా ఉంటారో, ఎవరికి ఎల్లప్పుడూ రక్షణలో కల్గిస్తుంటారో ఆ విధంగా రక్షణ కల్గిస్తుంటారో ఆ విధంగా రక్షణలో ఉండే దైవం "విష్వక్సేను" డని దీనిభావం.
“వందలకొలదీ గజముఖు” లనగానే వినాయకుళ్ళు అందరుంటారని అర్థం కాదు. ఒక్కోతీరు విఘ్నాన్ని నివారించడానికి ఒక్కో రూపంతో వినాయకుడు అక్కడుంటాడని దాని అర్థం.
అలా సర్వరూపాల్లోనూ కన్పించే వినాయకులంతా కలిస్తే వందలకొలదీ వినాయకులున్నట్టనిపిస్తుంది కదా!
