వినాయకుడిని వశంచేసుకునేందుకు నాలుగుతీరులయిన గాయత్రీ మంత్రాలు కన్పిస్తున్నాయి.
కృష్ణ యజుర్వేదంలోని తైత్తిరీయారణ్యకంలోని నారాయణో పనిషత్తును బట్టిచూస్తే
"ఏకదంతాయ విద్యహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతిః ప్రచోదయాత్”
అనే గణేశగాయత్రి కనిపిస్తుంది. పురాణాల ఆధారంగా పరిశీలిస్తే
"లంబోదరాయ విద్య హే మహోదరాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్”
అనే గణేశ గాయత్రి కన్పిస్తుంది.
"తత్పురుషాయ విద్యహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతిః ప్రచోదయాత్” అనే గణేశ గాయత్రి ప్రసిద్ధంగా ఉన్నదే.
"తత్కరాటాయ విద్యహే హస్తిముఖాయ ధీమహి తన్నోదంతిః ప్రచోదయాత్”
అనే గణేశగాయత్రిని గణపతులు ఉపాసిస్తారు.
దేనికైనా అర్థంఒకటే. "ఆ గజాననుణ్ణి ఉపాసిస్తున్న మాకు ఎల్లప్పుడూ ఆయన రక్ష ఉండుగాక” అని.
