గణపతి మహాభారతం - Ganesha Mahabharatham
August 05, 2025
పంచమ వేదంగా కీర్తించే మహాభారతాన్ని రచించమని వ్యాసభగవానుడిని ఆదేశిస్తాడు బ్రహ్మదేవుడు.
అలాగేనని చెప్పి, అయితే నేను భారతాన్ని చెబుతాను. నేన్ను చెప్పింది రాయగల ప్రజ్ఞా వంతుడిని పంపించమని అడుగుతాడు వ్యాసుడు, నేను చెబుతున్నప్పుడు ఆపకుండా రాయగలగాలి. ఒక్కక్షణం కూడా వృధా అవకూడదు. మధ్యలో ఆపకూడదు. అటువంటివాడు తనకు కావాలంటాడు.
ఆ కార్యానికి గణపతిని వినియోగిస్తాడు బ్రహ్మ. వ్యాసుడు చెప్పింది ఒక్క అక్షరం పొల్లు పోకుండా, ఎక్కడ విశ్రాంతి లేకుండా విరిగిన దంతంతో రాసుకుంటూ వెళ్ళిపోతాడు వినాయకుడు. పెద్ద పెద్ద సమాసాలతో కూడిన వ్యాక్యాలను కూడా చెప్పి పరీక్ష పెడతాడు వ్యాసుడు. వినాయకుడు తొణక్కుండా అంతే వేగంతో రాసుకుంటూ ఆ మహాకావ్యాన్ని పూర్తి చేస్తాడు.
అందుకే భారతం త్వరగా చదివినా, విన్నా వెంటనే అర్థమవుతుంది. చెప్పింది వ్యాస భగవానుడు, రాసింది వినాయకుడు. అందులో నాయకుడు శ్రీ కృష్ణ భగవానుడు.
ఇక ఇక్కడ చెప్పేదేముంది?!
Tags
