పండంటి, పరిపూర్ణుడైన బిడ్డను కనాలని ఏ తల్లికి వుండదు. అలాంటి కోరికే జగన్మాత పార్వతీదేవికి కలిగింది. తనకో పుత్రరత్నం కావాలని.
బొజ్జ గణపతిని పుత్రుడిగా పొందేందుకు పార్వతీదేవి పన్నెండేళ్ళపాటు సపమాచరించిందని స్థలపురాణం చెపుతోంది. ముంబయికీ సమీపంలో ఎత్తైన లెన్యిద్రిగుహలో ఆమె కఠోరంగా తపస్సుచేసింది.
ఆమె తపస్సు ఫలించి బొజ్జగణపయ్య శివపార్వతులకు పుత్రుడిగా జన్మించాడు. లెన్యిద్రి ఆలయ ప్రాకారంలో వినాయకుడు జన్మించాడని చెపుతారు.
తపోఫలంగా సిద్ధించిన వినాయకుడిని పార్వతి అల్లారు ముద్దుగా పెంచుకుంది. ఆయనే ఎదిగి విఘ్నములకు, దేవతలకు అధిపతి అయ్యాడు.
తమకు మంచి బిడ్డ జన్మించాలని మహిళలు పూజలు ఆచరించడం అనవాయితీ. ఈ విషయంలో పార్వతీ దేవియే ఆదర్శం. అలా లభించిన సంతానాన్ని వారు భగవత్ ప్రసాదంగా భావిస్తారు.
