నీలాపనింద ప్రభావం - వినాయక చవితి - Vinayaka Chaturthi
August 22, 2025
కైలాసం చేరిన విఘ్నేశ్వరుడు తన తల్లిదండ్రులకు సాష్టాంగ ప్రణామములు చేయాలనే తలంపుతో బోర్లపడుటకు చాలా యాతనపడుచుండగా, శివుని శిరంబున ఉన్న చంద్రుడు చూసి వికటముగా నవ్వెను. అనంతరం విఘ్నేశ్వరుని పొట్ట పగిలి పోయెను. పార్వతిదేవి ఆగ్రహించి "పాపాత్ముడా! నీ దృష్టి ప్రభావం వల్ల నా కుమారుడికి ఈ దుర్గతి కలిగింది. నిన్ను జూచిన వారు పాపాత్ములై, నీలాపనిందలు పొందుదురుగాక!" అని శపించింది.
ఋషిపత్నులకు అగ్నిదేవుడు మోహించాడు. శాపభయం వలన అశక్తితో క్షీణించు చున్నాడు. అగ్ని భార్య స్వాహాదేవి గ్రహించి, అరుంధతిదేవి రూపం తప్ప, మిగిలిన అన్ని రూపాలు తానే దాల్చి పతిని సంతుష్టిడ్నీ చేసింది. మహర్షులు కూడా అగ్నిదేవునితో నున్న వారు తమ భార్యలే అని శంకించి, వారిని వదలివేసారు. ఈఫలితం పార్వతిదేవి ఇచ్చిన నీలాపనిందవల్ల జరిగిందని ఋషిపత్నులు తెలుసుకొన్నారు. పరమేష్టికం తెలియజేయగా అగ్నిదేవుని భార్య స్వాహాదేవియే ఈ పని చేసిందని గ్రహించాడు. బ్రహ్మసప్త ఋషులు, దేవతలు ప్రార్ధనతో, పార్వతి భాద్రపద శుద్ధ చవితి రోజున చంద్రుని చూచినచో నీలాపనిందలు కలుగును అని చెప్పింది. ఉమామహేశ్వరులు విఘ్నేశ్వరుని బ్రతికించారు. నాటి నుండి ఎవ్వరూ చవితి చంద్రుని చూసే వారు గాదు.
Tags
