శమంతకోపాఖ్యానం - Vinayaka Chaturthi - వినాయక చవితి స్పెషల్
August 23, 2025
సత్రాజిత్తు రాజు దగ్గర రోజుకు ఇరవై బారువుల బంగారము నిచ్చే మణిహారం ఉంది. అది సూర్యభగవానుని వల్ల లభించింది. ఈ హారాన్ని సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు మెడలో వేసుకొని వేటకు అడవికి వెళ్లాడు. అడవిలో సింహం అతనిని చంపి శమంతక మణిని తీసుకుపోతుండగా, జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి ఆ మణిహారాన్ని తీసుకుపోయాడు. నిజానిజాలు తెలియక గతంలో అడిగిన శ్రీకృష్ణుడే తన తమ్ముడు ప్రసేనుని చంపి హారం అపహరించాడు అని నిందవేసాడు. ఆ విషయం తెలుసుకొన్న శ్రీకృష్ణుల వారు వినాయక చవితి రోజున పాలు పితుకుతుండగా, క్షీరములో చంద్రుని చూచుట వలన కలిగిందని భావించాడు. తదనంతరం సత్రాజిత్తు నిలాపనింద నివారణ కోసం ప్రసేనుడి వెళ్లిన మార్గం గుండా వెళ్లాడు. ఒక చోట గుహలో ఊయలలో శమంతకమణి కనిపించింది. ఆ మణి తీసుకొనే ప్రయత్నంలో జాంబవంతుడు అడ్డుకొన్నాడు. ఇరువది ఎనిమిది రోజులు రాత్రి, పగలు లేకుండా యుద్ధం చేసారు. తేత్రాయుగమున శ్రీరామచంద్రునిగా భావించి, తన కుమార్తెతో బాటు శమంతకమణి ఇచ్చాడు. సత్రాజిత్తు కూడా తన తప్పు తెలుసుకొని, తన కుమార్తె సత్యభామను ఇచ్చి, తిరిగి ఇచ్చిన శమంతకమణి శ్రీకృష్ణ భగవానుడు సత్రాజిత్తుకే ఇచ్చాడు.
దేవాదులు శ్రీకృష్ణునితో మీరు సమర్థులు. ఈ నీలాపనింద పడకుండా ప్రయత్నం చేసారు. మా వంటి వారికి ఎలా సాధ్యమవుతుంది? అని అడగగా శ్రీకృష్ణులవారు చవితి రోజున యధావిధిగా గణపతిని పూజించి, శమంతకమణి కథను విని అక్షతలు శిరసుపై వేసుకొన్న వారికి నిలాపనిందలు పొందలేరని చెప్పాడు. ఆ ప్రకారం వినాయకచవితి రోజున యధావిధిగా వినాయక వ్రతాన్ని ఆచరిస్తారు. వారు కష్టాలను వీడి సౌఖ్యాన్ని అనుభవిస్తారు అని సూతుడు చెప్పగా విని పాండవులు ఈ వ్రతాన్ని ఆచరించి, గణేశుని దయ వలన రాజ్య సంపదను పొందినారు.
ఇంద్రుడు పూజించి వృతాసురుని చంపాడు. సీతాదేవిని వెదుకునపుడు శ్రీరాముడును, గంగను భూమికి తెచ్చినపుడు భగీరథుడు అమృతోత్సాదనము చేయునపుడు దేవాసురులు, కుష్ఠువ్యాధి నివారణకు సాంబుడు ఈ వ్రతము ఆచరించి ఫలితములను పొందినారు.
అన్ని కార్యములు సిద్ధింపజేయుట వలన వినాయకుడికి సిద్ధి వినాయకుడని ప్రసిద్ధి. విద్యారంభకాలమున పూజించినచో విద్యాలాభం, పుత్రార్ధులకు పుత్రుడును, విధవలకు మరో జన్మమందు వైధవ్యము రాదు. కావున ఎల్లరూ వినాయక వ్రతాన్ని ఆచరించి, శ్రీ గణపతి దేవుని అనుగ్రహించే సకలైశ్వర్యములు బొంది సుఖముగా నుందురుగాక!
Tags
