శ్రీ దేవి నవరాత్రులు - నవదుర్గలు
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉🕉️🕉️🕉️
లోక సంరక్షణార్ధం జగన్మాత దాల్చిన అవతారాలు అనేకం. మన పురాణాలలో ఆ దేవినే శక్తి, చండి, అన్నపూర్ణ, దుర్గ , జగధ్ధాత్రి అని లెక్కకు మించిన పేర్లతో కొలుస్తారు.
శక్తి పూజా మహత్యాన్ని వివరించే శాక్తం అనే దేవీ మహాత్యం, దుర్గా సప్తశతి మొదలైన గ్రంధాలలో దేవిని "చండీ" అని వివరించాయి.
సామాన్యంగా చండి అనే నామాన్ని ధ్యానించినప్పుడు మన కళ్ళెదుట అమ్మవారి భయంకర రూపం గోచరిస్తుంది. దానవులను, దుష్టశక్తులను నాశనం చేయడానికి అవతరించిన జగన్మాత రూపం చండి.
ఆ చండియే తరువాత కాలంలో దుర్గాదేవిగా పిలువబడినది. దుఃఖాన్ని నాశనం చేసే దేవి దుర్గాదేవి. దుర్గతి అనే విధి కలిగించే కష్టాలను తొలగించే దేవి దుర్గ. ఆ దేవి యే మానవుల ఆకలిని తీర్చి సంపదలనిచ్చే అన్నపూర్ణాదేవి. విశ్వాధిదేవత అయినందున జగధ్ధాత్రి, వసంత కాలంలో వాసంతి.
మహాశక్తియే దుర్గ, లక్ష్మీ, సరస్వతి అని ముగ్గురు దేవేరులుగా నవరాత్రులలో పూజించబడుతున్నారు. దేవీ కవచం అనే గ్రంధం దుర్గాదేవి యొక్క ప్రధానమైన తొమ్మిది రూపాలను 'నవదుర్గ' లుగా వివరించినది. అవే ....
🌿1.శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి (శైలపుత్రి),
🌸2.బ్రహ్మచారిణి,
🌿3.చంద్రఘంటా,
🌸4.కుష్మాండా,
🌿5.కాత్యాయనీ,
🌸6.స్కంద మాతా
🌿7.కాళరాత్రి,
🌸8.మహాగౌరి,
🌿9.సిధ్ధధాత్రి,
ఇవేకాకుండా గుణాలననుసరించి , దేవి మూడు మూర్తులుగా కీర్తించ బడుతున్నది. సత్వగుణానికి సరస్వతిగా, రజో గుణానికి మహాలక్ష్మి గా తామస గుణానికి మహాకాళిగా వర్ణించారు..
శ్రీమాత్రే నమః….🙏🙏
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
