శరణం శరణమయా స్వామీ / Sharanam Sharanamaya Swamy - అయ్యప్ప భజన పాటల లిరిక్స్


శరణం శరణమయా - స్వామీ శరణం శరణమయా - అయ్యప్పా

శరణం అన్నామరణము లేదు శబరీగిరి నిలయా

||శరణం||


అందరి దేవుడవే స్వామి ఆదరించు దేవుడవే - అయ్యప్ప

అయ్యప్ప దేవుడవే స్వామి అరణ్య వాసుడవే

||శరణం||


హరి హర పుత్రుడవే స్వామి ఆనంద రూపుడవే - అయ్యప్ప 

మోహిని పుత్రుడవే స్వామి మోహన రూపుడవే

||శరణం||


మహిషీ మర్ధనుడా స్వామి మదగజవాహనుడా - అయ్యప్ప

వన్పులి వాహనుడా నీకు వందనము చేసెదము

||శరణం||


గజముఖ సోదరుడా స్వామి షణ్ముఖ సోదరుడా - అయ్యప్ప 

కారణజన్ముడవే స్వామి కావగ రావయ్య

||శరణం||


కార్తీక మాసాన స్వామి నీ మాల వేసుకొంటూ - అయ్యప్ప

నలుబది దినములూ స్వామి దీక్షతో కొలిచెదము

||శరణం||


ఇరుముడి మోసుకొని స్వామి నిన్నె తలచుకొని - అయ్యప్ప

శబరిగిరి చేరీ నిన్నే దర్శించు కొందాము

||శరణం||


పాలాభిషేకమయా నీకు నెయ్యాభిషేకమయా - అయ్యప్ప

చేయగా చూశాము నీకు శరణం పలికెదము

||శరణం||


తప్పులు ఎన్నెన్నో మేము అనుదినం చేసినను - అయ్యప్ప

తండ్రివోలే దరి చేర్చి మము దయతో బ్రోవుమయా

||శరణం||


స్వామియే.........

యే శరణమయ్యప్ప

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!