Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

06. గంగం గణపతి గణనాధా - వినాయక భజన పాటల లిరిక్స్ | Gam Gam Ghanapati gananaadha

గంగం గణపతి గణనాధా - దండాలయ్యా గణనాదా
శివశివమూర్తివి గణనాధా - పార్వతి తనయా గణనాధా॥గం॥

లోకాలేలే గణనాధా మమ్మేలగరావా గణనాధా.
చల్లగ బ్రోచే గణనాధా మము దీవించయ్యా గణనాధా॥గం॥

మూషిక వాహన గణనాధా - గుంజీలు తీస్తాం గణనాధా
పండ్లు పూలు కాయలతో నీకు పూజలు చేస్తాం గణనాధా. ॥గం॥

పాలవెళ్లినే కట్టాము నీ మట్టి బొమ్మనే తెచ్చాము.  
కొలువు తీరరా గణనాధా - మా ఇంటనుండరా గణనాధా.  ॥గం॥

ఏటా నిన్ను గణనాధా - కొలిచేమయ్యా గణనాధా
ఇంటిల్లిపాది అందరము నిను మొక్కేమయ్య గణనాధా 
॥గం॥
📢 Follow