శ్రీ సూర్య నమస్కార మంత్రం

P Madhav Kumar

ఆరోగ్యం కోసం సూర్యని మంత్రం

🌱నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే!

ఆయురారోగ్య ఐశ్వర్యo దేహి దేహిదేవః జగత్పతే!!🌱


🙏అర్థం🙏


ఓ సూర్యదేవ! జగత్ పరిపాలకా! నీకిదే నా నమస్కారము. నీవు సర్వరోగములను తొలగించువాడవు. శాంతిని వొసంగువాడవు.

మాకు ఆయువును, ఆరోగ్యమును, సంపదను అనుగ్రహించుము. 


సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం సూర్యుడు కి నమస్కారం చేసే వారిలో ఇతరుల కన్నా రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది నమస్కార ముద్ర కూడా ఒక ఆసనం ,అలా నమస్కారం చేస్తూ 12 సూర్య నామాలు చదివే సమయం లేదా ఇక్కడ ఇచ్చిన ఈ శ్లోకమ్ కనీసం 12 సార్లు అయిన జపిస్తూ సూర్యుడు ఎదురుగా నిల్చుని నమస్కారం చేస్తే నమస్కార ప్రియుడు అయిన సూర్యుడు సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహిస్తారు.. అలాగే ఇతరులతో పోలిస్తే సూర్య నమస్కారం చేసే వారి చుట్టూ రేఖీ అధికంగా ఉంటుంది.. ఈ రెండు వాక్యల చిన్న శ్లోకం పిల్లలకు అలవాటు చేయండి పిల్లలు ఇలా సూర్య నమస్కారం చేయడం వల్ల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి పెరుగుతుంది క్రమశిక్షణ అలవాటు అవుతుంది.. పిల్లలు తల్లితండ్రుల మాట వింటారు..


ఓం ధ్యాయేస్సదా సవితృమండలమధ్యవర్తీ

నారాయణస్సరసిజాసన సన్నివిష్టః |

కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ

హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ||


సూర్య ద్వాదశ నామాలు

ఈ ద్వాదశ నామాలు కూడా స్మరించుకుంటే సూర్యనారాయణుడు ఆశీర్వాదం లభిస్తుంది...🙏🌹🎻

ఓం మిత్రాయ నమః | 1 |

ఓం రవయే నమః | 2 |

ఓం సూర్యాయ నమః | 3 |

ఓం భానవే నమః | 4 |

ఓం ఖగాయ నమః | 5 |

ఓం పూష్ణే నమః | 6 |

ఓం హిరణ్యగర్భాయ నమః | 7 |

ఓం మరీచయే నమః | 8 |

ఓం ఆదిత్యాయ నమః | 9 |

ఓం సవిత్రే నమః | 10 |

ఓం అర్కాయ నమః | 11 |

ఓం భాస్కరాయ నమః | 12 |


ఆదిత్యస్య నమస్కారాన్ యే కుర్వంతి దినే దినే |

ఆయుః ప్రజ్ఞాం బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే ||


ఇతి శ్రీ సూర్య నమస్కార మంత్రం సంపూర్ణం ||





#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat