చిత్రగుప్తుడు

P Madhav Kumar


                 చిత్రగుప్తుడు హిందూ పురాణాల ప్రకారం మనుషుల పాప పుణ్యాల చిట్టా రాసేవాడు. యమధర్మ రాజు ఆస్థానంలో ఉంటాడు. మనుషులు చనిపోయిన తరువాత వారికి స్వర్గమో, నరకమో ఈయన తేలుస్తాడు. చిత్రగుప్తుడు భారత్ లోనూ, నేపాల్ లోనూ కాయస్థులకు ఆరాధ్య దేవుడు. ఈయన బ్రహ్మ పుత్రుడు కాబట్టి హిందూ పురాణాలలో ఈయనకు ప్రత్యేకమైన స్థానం ఉంది.


వివిధ పురాణాల ప్రకారం బ్రహ్మకు అనేకమంది సంతానం ఉన్నారు. వారిలో వశిష్టుడు, నారదుడు, అత్రి ముని లాంటి వారు మానస పుత్రులు. మరికొంత మంది బ్రహ్మ శరీరం నుండి ఉద్భవించిన వారు. చిత్రగుప్తుడి జననం చాలా రకాలుగా వర్ణించబడి ఉన్నా ఆయన బ్రహ్మ శరీరం నుంచి ఉద్భవించాడు అనేది ఈ కథనాలన్నింటిలో కనిపించే ఉమ్మడి సారాంశం.


బాగా ప్రాచుర్యం చెందిన కథ ప్రకారం బ్రహ్మ మరణించిన వారి లోకాన్ని యముడికి అప్పగించాడు. యముడు తన దగ్గరికి వచ్చే అనేక ఆత్మలను నియంత్రించ లేక అప్పుడప్పుడూ వారిని స్వర్గానికి లేదా నరకానికి పంపించడంలో పొరపాట్లు జరిగేవి. బ్రహ్మ యముడిని ఈ పొరపాట్లు సవరించుకోమని హెచ్చరిస్తాడు కానీ ఒక్కో జీవి ఎత్తే ఎనభై నాలుగు జన్మల వలన తనకు నిర్వహించడం కష్టంగా ఉందని తెలియజేస్తాడు. దాంతో బ్రహ్మ ఆ సమస్యను పరిష్కరించడానికి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. ఆఖరున కళ్ళు తెరిచి చూసే సరికి తనకు ఎదురుగా ఒక వ్యక్తి కలం, కాగితం పట్టుకుని కనిపించాడు. చిత్రగుప్తుడు బ్రహ్మ శరీరం నుంచి ఉద్భవించాడు కాబట్టి ఆయనకు జన్మించిన వారసులను కాయస్థులు అని వ్యవహరిస్తారు.


మొదటగా బ్రహ్మ మనసులో ఆలోచనగా మొదలై , మిగతా దేవతలకు తెలియకుండా (గుప్తంగా) సృష్టించబడ్డాడు కాబట్టి అతని పేరు చిత్రగుప్తుడు అయ్యింది. సర్వేజనాసుఖినోభవంతు 🙏🙏🙏




#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat