*గొప్ప గొప్ప కలలు కను కానీ కలలతో* *ఆగిపోనివ్వకు...వెయ్యి..కలలను సాకారం చేసే దిశగా అడుగులు వెయ్యి!!*
*నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించే ప్రణాళికలు రచించు!!*
*అదృష్టం అనే ఆధారం లేని నిచ్చెన మీద ఆధారపడకు!!*
*సముద్రపు అలలను చూసి నీ గమ్యం చేరుకోవడానికి కావలసినంత ఓర్పును నేర్చుకో!!*
*నీ లక్ష్యాన్ని చేరే మార్గంలో ఎన్ని కష్టాలు వచ్చినా నీ పయనం ఆపకు!!*
*సవ్యసాచిలా నీ పట్టుదల అనే బాణాన్ని సంధించు...*
*అల్లంత దూరాన పక్షి కన్నులగా ఉన్న నీ లక్ష్యాన్ని సాధించు!!*
*మిమ్మల్ని చూసి ఎగతాళిగా నవ్వేవాళ్ళని నవ్వని*
*అసూయతో ఏడ్చేవాళ్ళని ఏడవని*
*నువ్వు మాత్రం నీ లాగే ఉండు*
*ఎదో ఒక రోజు అ నవ్విన* *వాళ్ళు.. ఏడ్చిన వాళ్ళు తప్పకుండా నీ సాయం కోసం నీ దెగ్గరకే వస్తారు..*
*స్థిత ప్రజ్ఞతే స్థిరాస్తి....*