Salt: ఉప్పు వల్ల ఎన్ని నష్టాలో తెలుసా.. అన్ని ఆరోగ్య సమస్యలకు అదే కారణం!

P Madhav Kumar

 సాధారణంగా మనం తయారు చేసుకునే ఆహార పదార్థాలు రుచిగా ఉండాలి అంటే అందుకు సరిపడా ఉప్పు కారం తప్పనిసరిగా వేసుకోవాలి ఇలా సరిపడినంత ఉప్పు కారం వేసుకున్నప్పుడే ఆహారం తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి.



ఇకపోతే చాలామంది వారి ఆహార పదార్థాలతో పాటు అదనంగా ఎక్కువగా ఉప్పు తీసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ విధంగా ఉప్పు అధికంగా తీసుకునేవారు తొందరగా మరణిస్తున్నారని నిపుణులు పలు పరిశోధనల ద్వారా వెల్లడించారు.

USAలోని న్యూ ఓర్లీన్స్‌లోని టులేన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ట్రాపికల్ మెడిసిన్, ప్రొఫెసర్ లు క్వి ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనంలో భాగంగా 501379 మంది పాల్గొన్నారు. యూరోపియన్ హార్ట్ జర్నల్ లో జులై 11న ఈ పరిశోధన గురించి ప్రచురించారు. ఇక ఈ అధ్యాయంలో పాల్గొన్న వారిని ఎన్నో రకాల ప్రశ్నలు వేస్తూ వారి నుంచి సమాధానాలు రాబట్టారు. వారు ఎంత మొత్తంలో రోజుకు ఆహారంలో ఉప్పు వేస్తున్నారు ఆహారంలో వేయడమే కాకుండా మరింత అదనంగా తీసుకుంటున్నారా అన్న విషయాల గురించి పరిశోధనలు నిర్వహించారు.

ఈ పరిశోధనలో భాగంగా ఆహార పదార్థాలలో ఉప్పు వేసుకుని తినేవారికన్నా ఆహార పదార్థాలలో కాకుండా అదనంగా ఉప్పు తినే వారిలో మరణాల రేటు అధికంగా ఉందని అధికంగా ఉప్పు తీసుకునేవారు ముందుగా చనిపోతున్నారని పరిశోధకులు వెల్లడించారు. 50 సంవత్సరాలు పైబడిన పురుషులు ఆహారంలో అదనపు ఉప్పు వేసుకుంటే 2.28 ఏళ్లలోనే ప్రాణాలు కోల్పోయారని నిపుణులు తెలియజేశారు.

ఈ క్రమంలోనే రోజులో ఎంత మొత్తంలో ఉప్పు తీసుకోవాలి అనే విషయానికి వస్తే రోజుకు రెండు గ్రాముల కంటే ఎక్కువ అయిదు గ్రాముల లోపే ఉప్పు తీసుకోవాలి ఇంతకన్నా అధిక మొత్తంలో ఉప్పు తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ గుండె సమస్యలు స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదాలు అధికంగా ఉన్నాయి.

ఎవరైతే ఎక్కువగా గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఉప్పు అధికంగా తీసుకుంటున్నారని అర్థం. ఇక ఎవరిలోనైనా వాపు, అధిక రక్తపోటు, దాహం ఎక్కువగా వేయడం మూత్ర విసర్జన,నిద్రలేమి నీరసం వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నవారు ఉప్పు అధికంగా తీసుకుంటున్నారని అర్థం. ఈ క్రమంలోనే వీలైనంతవరకు ఉప్పును తగినంత మోతాదులో తీసుకోవడం మంచిదని లేకపోతే మీ ఆయుష్షు క్రమంగా తగ్గుతుందని నిపుణులు తెలియజేశారు.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat