మొక్కిన తరగును చీకట్లు.. ఎక్కిన తొలగును ఇక్కట్లు.. ఇహానికి, పరానికి, వేసిన వంతెన ఈ మెట్లు -
|| పద్దెనిమిది ||
ఒకటో మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్పా నమ్మితినేనయ్యప్పా దేవుడు ఒకడేనంటూ ఆ దేవుడు నీవేనంటూ రెండో మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్పా కొలిచితినేనయ్యప్పా జ్ఞానము నీదేనంటూ అజ్ఞానిని నేనే అంటూ
మూడో మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్పా మొక్కితినేనయ్యప్పా త్రిలోక నేతవు నీవని త్రికాల జ్ఞానివి నీవని.
|| పద్దెనిమిది ||
నాల్గో మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్పా పలికితినేనయ్యప్పా చతుర్వేదములు నీవని చతురాననునే నీవని అయిదవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్పా అంటినినేనయ్యప్పా పంచభూతములు నీవని పంచామృతమే నీవని
ఆరోవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్పా అడిగితినినేనయ్యప్పా అరిషడ్వర్గము నాదని నరికే ఖడ్గము నీవని..
|| పద్దెనిమిది ||
ఏడవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్పా వేడితినేనయ్యప్పా ఏడులోకాలు నీవని మమ్మెలే దైవం నీవనీ ఎనిమిదో మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్పా ఎరిగితినేనయ్యప్పా అష్టదిశలలో నీవనీ అష్ట సిద్ధులు నీవనీ
తొమ్మిదవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్పా తోచేను నాకు అయ్యప్పా నవరసమూర్తివి నీవనీ నవచైతన్యం నీవనీ
|| పద్దెనిమిది ||
పదవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్పా పాడితినేనయ్యప్పా దశవతారాలు నీవనీ మా దశలకు కారకుడేననీ పదకొండో మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్పా ప్రణమిల్లితినేనయ్యప్పా పార్వతి సుతుడే నీవనీ పరమ పావనుడ నీవనీ
పన్నెండో మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్పా పలికితినేనయ్యప్పా గ్రహరాసులలో నీవనీ నీ అనుగ్రహమే ఇక మాధనీ
|| పద్దెనిమిది ||
పదముడో మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్పా పిలిచితినేనయ్యాప్పా పదములు పాడితి అయ్యప్పా నీపదము లు మొక్కితి అయ్యప్పా పద్నాలుగో మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్పా భక్తి తోడనేనయ్యప్పా భగవతి సుతుడంట అయ్యప్పా భగవంతుడవేనీవప్పా
పదిహేనో మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్పా పాపవినాశక అయ్యప్పా కాలగమనమే నీవప్పా లోకాల అభయుడే నీవప్పా
|| పద్దెనిమిది ||
పదహారో మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్పా పాడితినేనయ్యప్పా షోడశకళలే నీవనీ చంద్రకళాధర సుతుడే నీవనీ పదిహేడో మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్పా పలికితినేనయ్యప్పా మా తప్పులనే అయ్యప్ప మన్నించవయ్య అయ్యప్పా
పద్దెనిమిదో మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్పా మోకరెల్లితిని అయ్యప్పా అష్టాదశ మూర్తి అయ్యప్పా అన్నదాన ప్రభు అయ్యప్పా.
|| పద్దెనిమిది ||
