ఎంత చల్లనిదమ్మ ఆ శబరికొండ.. నాగమల్లెలో తీగమల్లెలో
బాల మణికంఠుని బంగారు కొండ.. నాగమల్లెలో తీగమల్లెలో
||ఎంత చల్లనిదమ్మ||
పచ్చ పచ్చని చెట్టు పైట చుట్టినట్టు, నల్ల నల్లని కురులు విరబోసుకున్నట్టు
తీరొక్క పువ్వులు సిగలోన పూయంగా, మెరిసిపోయేనంట ఈ శబరికొండ
||ఎంత చల్లనిదమ్మ||
పొడిచేటి పొద్దుల్లో ఒళ్ళంత మెరువంగా, వడిలోన ఆ పంప బిరబిర పారంగా
పక్షుల కిలకిల కోయిల రాగాలు, పరవశమొంది మురిసేటి ఆ కొండ
||ఎంత చల్లనిదమ్మ||
ఇరుముడితో స్వాములంతా కలిసి రాంగా, శరణుఘోషతోని మారుమ్రోగిపోయి
ఒళ్ళు పులకరించి ముళ్ల దార్లన్నీ, పూల బాటలుగా మార్చెను ఆ కొండ
||ఎంత చల్లనిదమ్మ||
మహిమగల మహా దివ్య క్షేత్రమయి, మణికంఠ దేవుని పుణ్య స్థావరమయి
బాల మణికంఠుని తల మీదనే మోస్తూ, పావనమయ్యింది ఈ శబరికొండ
||ఎంత చల్లనిదమ్మ||
