228. నా రెండు నయనాలు ఉయ్యాలగా (జోలపాట) | Naa rendu nayanaalu Uyyalaga | అయ్యప్ప భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી

228. నా రెండు నయనాలు ఉయ్యాలగా (జోలపాట) | Naa rendu nayanaalu Uyyalaga | అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
నా రెండు నయనాలు ఉయ్యాలగా 
నా గుండె నాదాలు నీ జోలగా || 2 || 
జ్యో.......జ్యో జ్యో.. లాలీ జ్యో.......జ్యో జ్యో || 2 ||

నెలవంక విరబూసే ఆకాశమే నెలరాజు దిగివచ్చే నీ కోసమే || 2 || 
ముక్కోటి దేవతలు దీవించగా ముత్యాల ఉయ్యాల ఊగయ్యరా 
|| నా రెండు నయనాలు ||
జ్యో.......జ్యో జ్యో... లాలీ జ్యో.......జ్యో జ్యో || 2 ||

అలలాడి అలసింది అలకా నది కలలందు మెరిసింది శబరీగిరి || 2 || 
ప్రవహించి మురిసింది పంపా నది ఆలించి లాలించే గంగా నది
 || నా రెండు నయనాలు ||
జ్యో.......జ్యో జ్యో... లాలీ జ్యో.......జ్యో జ్యో || 2 ||

భ్రమరాలు నిదురించె కమలాలలో సుమ బాల పయనించే కిసలాలలో || 2 || 
మీ అమ్మా మీ నాన్న నిదురించగా ఇకనైనా ఈ రేయి చాలించురా 
|| నా రెండు నయనాలు ||
జ్యో.......జ్యో జ్యో... లాలీ జ్యో.......జ్యో జ్యో || 2 ||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow