భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే ఆహారం బియ్యం. దీన్ని రకరకాలుగా వండుకోవచ్చు. సాధారణంగా చాలా మంది అన్నం వండేటప్పుడు నీళ్లు ఎక్కువగా పోసి గంజిని వారుస్తుంటారు.
కానీ మీరు అలా చేయడం తప్పు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వండిన అన్నం గంజి వార్చేస్తే… చాలా వరకు పోషకాలు వృథా అవుతాయి అంటున్నారు పోషకాహార నిపుణులు. గంజి తాగడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలను అనేకం ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా.. గంజిలో అధిక పోషకాలు ఉంటాయి. విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ ఇందులో పుష్కలంగా లభిస్తాయి.
– గంజి తాగడం వల్ల శరీరానికి త్వరిత శక్తి అందుతుంది, దీని వల్ల శరీరం యొక్క అలసట చాలా వరకు పోతుంది.
– గంజి మన చర్మానికి చాలా మేలు చేస్తుంది. అతినీలలోహిత కిరణాలు, ఇన్ఫెక్షన్ల ప్రభావాన్ని తగ్గించే శక్తి గంజికి ఉంది. అన్నంలోంచి వంచిన గంజి నీటిని ముఖానికి పట్టించటం కూడా ప్రయోజనం కలుగుతుంది.
– ఈ రోజుల్లో చాలా మంది జుట్టు నెరవడం, జుట్టు రాలడం అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. గంజిని తలకు పట్టించి 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆపై తేలికపాటి షాంపూ, కండీషనర్‌తో జుట్టును కడగాలి.
– వండిన అన్నం గంజిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇలా చేయడం వల్ల ముఖంలోని బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగిపోతాయి.
– గంజి వినియోగం క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అనేక అధ్యయనాలలో నిరూపించబడింది.
– గంజిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. దీనివల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
– నిత్యం అన్నం గంజి తాగే వారి శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది.
– మీరు హైపోటెన్షన్ లేదా తక్కువ రక్తపోటుతో పోరాడుతున్నట్లయితే గంజిలో ఉప్పు కలుపుకుని తాగొచ్చు.
– వైరల్ ఫీవర్ లో గంజి తక్కువేమీ కాదు, కాస్త ఉప్పు కలిపి తాగితే జ్వరం త్వరగా మాయమవుతుంది.
– గంజి తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది అనేక శరీర సమస్యలను నయం చేస్తుంది.