ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం మంది అధిక బరువుతో బాధపడడంతో పాటు షుగర్ వ్యాధితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యను ఎదుర్కొంటున్న ఈ సమయంలో కొన్ని ఆరోగ్య చిట్కాలు అద్భుతమైన ప్రయోజనాన్ని చేకూర్చుతున్నాయి. జీవన విధానం మారడంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో అన్ని అనారోగ్య సమస్యలకు అద్భుతమైన ఔషధం యాపిల్ టీ అంటూ నిపుణులు సూచిస్తున్నారు.
గత కొంత కాలంగా చాలా మంది బరువు తగ్గడానికి గ్రీన్ టీ, లెమన్ టీ తాగుతున్నారు. ఇప్పుడు వాటితో పాటు యాపిల్ టీ కూడా తాగితే బరువు తగ్గడంతో పాటు పలు అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు అంటూ నిపుణులు ప్రత్యక్షంగా నిరూపించారు.
ప్రతి రోజు యాపిల్ తింటే గుండె సమస్యల నుండి అనేక సమస్యలకు దూరంగా ఉండవచ్చని వైద్యులు అంటూ ఉంటారు. అలాంటి యాపిల్ తో యాపిల్ టీ ని తయారు చేయించుకుని తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెప్తున్నారు.
యాపిల్ టీ తయారు చేసుకునే విధానం.. దీని కోసం రెండు కప్పుల నీటిని తీసుకుని ఒక పాత్రలో పోసి వేడి చేయాలి. ఆ నీటిలో టీ బ్యాగ్, నిమ్మరసం కావాల్సిన పరిమాణంలో వేయాలి. ఆ నీరు మరుగుతున్న సమయంలో ఆపిల్ ముక్కలు వేసుకోవాలి. కొద్ది సమయం మరిగిన తర్వాత నీటిలో దాల్చిన చెక్క పొడి వేసి ఒక నిమిషం మరగనివ్వాలి. ఆ తర్వాత ఒక టీ గ్లాసులోకి వడబోసుకోవాలి. వేడిగా లేదా వేడి లేకుండా ఈ ఆపిల్ టీ తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండే అవకాశం ఉంది.