బంధము ఉన్నదయ్యా నీతో అనుబంధము ఉన్నదయ్యా అయ్యప్ప ||2||
రావా మొర వినవా
దర్శనమియ్యవా స్వామి
రావా మొర వినవా
దరిజేర్చుకో మా స్వామి
||బంధము ఉన్నదయ్యా ||2||
కార్తీకమాసములోన స్వామి
నిమాలను వేసేమయ్యా అయ్యప్ప
కార్తీకమాసములోన స్వామి
నీ దీక్ష చేసేశామయ్యా అయ్యప్ప
నిమాలను వేసేమయ్యా అయ్యప్ప
నీ దీక్ష చేసేశామయ్యా అయ్యప్ప
రావా మొర వినవా
దర్శనమియ్యవా స్వామి
రావా మొర వినవా
దరిజేర్చుకో మా స్వామి
||బంధము ఉన్నదయ్యా ||2||
ఏ పూర్వజన్మాల పుణ్యాల బలమో
పడిపూజ చేసేశామయ్యా అయ్యప్ప
ఏ పూర్వజన్మాల పుణ్యాల బలమో
నీ సేవ చేసేశామయ్యా అయ్యప్ప
పడిపూజ చేసేశామయ్యా అయ్యప్ప
నీ సేవ చేసేశామయ్యా అయ్యప్ప
రావా మొర వినవా
దర్శనమియ్యవా స్వామి
రావా మొర వినవా
దరిజేర్చుకో మా స్వామి
||బంధము ఉన్నదయ్యా ||2||
ఏ పూర్వజన్మాల బలమో
పాద యాత్ర చేసేశామయ్యా అయ్యప్ప
ఏ పూర్వజన్మాల బలమో
నీ కొండకొచ్చేశామయ్యా అయ్యప్ప
పాద యాత్ర చేసేశామయ్యా అయ్యప్ప
నీ కొండకొచ్చేశామయ్యా అయ్యప్ప
రావా మొర వినవా
దర్శనమియ్యవా స్వామి
రావా మొర వినవా
దరిజేర్చుకో మా స్వామి
||బంధము ఉన్నదయ్యా ||2||
తెలిసి తెలియక చేసిన తప్పులు
క్షమించరావేమయ్యా అయ్యప్ప
తెలిసి తెలియక చేసిన తప్పులు
క్షమించరావేమయ్యా అయ్యప్ప
క్షమించరావేమయ్యా అయ్యప్ప
కరుణించరావేమయ్యా అయ్యప్ప
రావా మొర వినవా
దర్శనమియ్యవా స్వామి
రావా మొర వినవా
దరిజేర్చుకో మా స్వామి
బంధము ఉన్నదయ్యా నీతో అనుబంధము ఉన్నదయ్యా అయ్యప్ప
బంధము ఉన్నదయ్యా నీతో అనుబంధము ఉన్నదయ్యా అయ్యప్ప
