అమృత బిందువులు - 15 ఆలోచనా తత్వం - 7

P Madhav Kumar


*ఆలోచనా తత్వం - 7*


సోమరిపోతుగా మిగిలి పోనే కూడదు ! అది పనిహాని.


తిరుగుబోతని జనులచే అనిపించుకోనేకూడదు ! అది అవమానకరం. 


తిండిపోతు అను బిరుదును పొందనే కూడదు ! అది అవహేళనమగును.


కొంప కొల్లేరైనా చెంపమీద చేయి మోపనేకూడదు అది దురభ్యాసము. 


భోజనం చేసిన అకులను దాటి నడవనేకూడదు ! అది ప్రరబ్రహ్మ ధిక్కారము. వీలుండినచో దాన్ని తీసి అవతల పారేసి నడవాలి.


రోగులతో కలసి ఒకే మంచంపై పడుకోనేకూడదు ! అది అనారోగ్యకరం. 


ఒకరు వాడిన బ్రష్ , సబ్బును ఇతరులు వాడనేకూడదు ! అది అనారోగ్యం.


ఆలయానికి వెళ్ళివచ్చాక కాళ్ళు కడుక్కోని ఇంట్లో ప్రవేశించనేకూడదు.


దీపం పెట్టిన పిమ్మట ఇల్లు ఊడవనేకూడదు ! అది 

అరిష్టదాయకం.


సూర్యని ప్రతిబింబమును నీటిలో చూడనేకూడదు ! అది అనాచారము.


అనుకొన్నవన్నీ జరిగి పోవాలి అని అనుకోనేకూడదు ! అది దురాశ. 


అనుదినం శరణుకోటి వ్రాయుటను మరచిపోనేకూడదు ! అది పరిపాటి. 


ఏటేట శబరిమలకు వెళ్ళే అలవాటును వదలనేకూడదు ! అది కర్తవ్యం. 


కోరి ఎవ్వరూ కష్టాలు కొని తెచ్చుకోనే కూడదు ! అది అవివేకము.


*అప్పుచేసి శబరియాత్ర చేయుటకన్న యాచకమెత్తి యాత్రపోవుట మిన్న.*


మాతా పితరులను సేవించవలెను ! అది ప్రతివారి కర్తవ్యం.


ఎల్లపుడు సత్యమునే పలుకవలెను ! సత్యమే సర్వత్ర జయము.


ధర్మమునే అచరించవలెను ! నీవు ఆచరించిన ధర్మం నిన్ను కాపాడును. 


ఉన్న ఆస్తిని కాపాడుకో... ! లేని ఆస్తికి ప్రాకులాడకు... ! కోల్పోగలవు. 


నాలుకను అదుపులో ఉంచుకోవలెను లేనిచో అది కొనితెచ్చును లడాయి. పిదప మనస్సుకు అశాంతి నిశ్చయం.


ప్రియంగా , హితంగా , మితంగా మాట్టాడవలెను ! అదియే ఆనందం.


సుఖమును అందరితో పంచుకొనవచ్చు కాని దుఃఖాన్ని నీవే భరించాలి.


ఎదుటివారి కష్టాలలో దయ చూపవలెను. అదియే మానవత.


ఆకలిగొన్నవానికి అన్నము పెట్టవలెను. అదియే అసలైన అన్నదానము.


సజ్జన సాంగత్యం చేయవలెను. శరణన్న వారిని క్షమించవలెను. 


నీ సోదరులను నీతో సమానముగా చూసుకోవలెను. అదియే పెద్దరికం.


*గురువుల మాట వినవలెను ! గురువుమాట బంగారు బాటయగును.*


ఇతరులకు మేలు చేయవలెను ! అపుడే నీకితరులు సాయపడుదురు.


చట్టమును గౌరవించవలెను ! అపుడే నిర్భయముగా జీవించగలము. 


దుర్జనునకు దూరంగా ఉండవలెను. లేనిచో లేనిపోని తంటా వచ్చిపడును.


అందరితో పరిచయం , కొందరితో సఖ్యం , ఒక్కరితో చెలిమి సాధించాలి ! అప్పుడే జీవితమున గెలుపొందినవారౌతాము.


ఆకలిగొన్నవాడు అన్నంకోసం పరితపించినట్లు జిజ్ఞాసువులు భగవంతుని కోసం పరితపించెదరు.


దేవుని ఎల్లప్పుడు ధ్యానించాలి ! అపుడే మనసుకు శాంతి లభించును.


కన్నతల్లిని ఎల్లపుడు ఆదరించాలి ! అపుడే దైవం నీకనుకూలించును.


దుఃఖము దాచుకొని ఆనందం పంచుకోవాలి ! అదియే పరమానందం.


మాట్లాడుటకుముందు ఆలోచించాలి ! పిమ్మట అలోచించుట అవివేకం.


నీచులతో నేస్తం వదులు కోవాలి ! లేనిచో కలుగును కష్టం.


అడుగు పెట్టేటప్పుడు చూచి పెట్టాలి ! లేనిచో జారిపడుట ఖాయం.


ముమ్మారు యోచించి హితంగా , మితంగా మాట్లాడాలి !


కష్టపడ్డవారికి విశ్రాంతి కల్పించవలెను ! లేనిచో మనకు కలుగును కష్టం. 


కాలం విలువ తెలుసుకోవలెను ! లేనిచో కాలం గుణపాఠము నేర్పును.


నోరు తెరవడం కన్నా కన్ను , చెవులు తెరవడం మేలు !


సత్యం , న్యాయం , క్రమశిక్షణ అనే మూడు గుణాలు అలవరచుకోవాలి  ! 


పొందిన మేలును మరువక సదా జ్ఞాపకముంచుకోవాలి! అదియే ధర్మం.


కష్టాన్ని మరవాలంటే భగవంతుని స్మరించాలి ! దేవుడు దయామయుడు. 


నువ్వు దేవున్ని ప్రేమిస్తే చాలదు ! ఆతడు నిన్ను ప్రేమంచేటట్లు నడుచుకోవాలి. అంటే సర్వదా భగవన్నామ స్మరణ చేయాలన్నమాట.


అపకారికి ఉపకారము చేయవలెను ! కానీ అది అపకారమై తీరకూడదు.


దేశం నాకేమిచ్చిందనేదానికన్న దేశానికి నీవేమిచ్చావని అలోచించాలి !


ఇతరుల లోని మంచిని మెచ్చుకోవాలి ! నీలోని చెడును దిద్దుకోవాలి ! 


లేనప్పుడు కాదు ఉన్నప్పుడు కూడా పొదుపు గురించి అలోచించాలి ! 


గౌరవం కష్టపడి సంపాదించుకోవాలి ! అది పోగొట్టుకొనుట సులభం. 


కీర్తి కష్టపడి అర్జించాలి ! దాన్ని నిలుపుకొనుటకు చాలా శ్రమపడాలి. 


తిండి కోసం శరీరమెలా తపిస్తుందో ప్రార్ధనకోసం మనసు తపనపడాలి! 


నీ మనసును దేవునికి , చేతులను పనికి అర్పణ చేయాలి ! అప్పుడే జయం. 


దప్పిగొన్నవానికి మంచినీరు ఇవ్వాలి ! ఆకలిగొన్నవానికి ఆహారమిడాలి. 


రోగులకు ప్రేమతో సేవచేయవలెను ! అదియే మాధవ సేవ. 


నువ్వు నేను , నాదినీది అనేవి మనిషిని పాడుచేస్తాయి. దాన్ని వదలాలి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat