భావింప సకల సంపద రూప మది వో…
పావనముల కెల్ల పావన మయము…
అదివో…
అదివో, అల్లదివో శ్రీహరి వాసము
పదివేల శేషుల పడగల మయము
అదివో, అల్లదివో శ్రీహరి వాసము
పదివేల శేషుల పడగల మయము
1. అది వేంకటాచల మహిలోన్నతము
అదివో బ్రహ్మదుల కపురూపము
అదివో నిత్య నివాస మఖిల మునులకు
డదె చూడడు, డదె మ్రొక్కడు
డదె చూడుడు, డదె మ్రొక్కడు దానంద మయము
అదివో, అల్లదివో శ్రీహరి వాసము
పదివేల శేషుల పడగల మయము
2. చంగట నల్లదివో శేషా చలము
నింగినున్న దేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము
అదివో, అల్లదివో శ్రీహరి వాసము
పదివేల శేషుల పడగల మయము
3. కైవల్య పదముల వెంకటనగమదివో
శ్రీ వెంకటపతికి సిరులైనవి
భావింప సకల సంపద రూప మదివో వాగ్గే
పావనమ్ముల పావన మయము
అదివో, అల్లదివో శ్రీహరి వాసము
పదివేల శేషుల పడగల మయము
వేంకటేశా హరే – శ్రీనివాస హరే
శ్రీనివాస హరే – వేంకటేశ హరే