కళ్యాణము చూతము రారండి
శ్రీశివ పార్వతుల కళ్యాణము చూద్దాము రారండి
1. చూచు వారలకు చూడ ముచ్చటట
పూణ్య పురుషులకు ధన్య భాగ్యమట
భక్తి యుక్తులకు ముక్తి ప్రదమట ఆ… ఆ… ఆ…
భక్తులకెల్ల చూడ ముచ్చట
కళ్యాణము చూతము రారండి
శ్రీశివ పార్వతుల కళ్యాణము చూద్దాము రారండి
2. ప్రపంచ శాంతికి కశ్యప్రజా పతి
మహ నిప్పుతో యజ్ఞము చేసి
దీనుల మొర లాలించుట కొరకై ఆ… ఆ… ఆ…
పెనుమాక పురమున వెలసిన శివుని
కళ్యాణము చూతము రారండి
శ్రీశివ పార్వతుల కళ్యాణము చూద్దాము రారండి
3. పుడమి నంతము రధముగ జేసి
విష్ణు దేవుని శరముగ దాల్చి
త్రిపురాసుర సంహారము జేసి ఆ… ఆ… ఆ…
పార్వతి మనసున దోచిన శివుని
కళ్యాణము చూతము రారండి
శ్రీశివ పార్వతుల కళ్యాణము చూద్దాము రారండి
4. సురకు మునులకు అభేద్యమైనది
ముగ్గురు మూర్ఖులకు కలవి కానిదగు
మహిషాసుర సంహారము జేసి ఆ… ఆ… ఆ…
రుద్రుని గెలిచిన గిరిజా దేవి
కళ్యాణము చూతము రారండి
శ్రీశివ పార్వతుల కళ్యాణము చూద్దాము రారండి
5. సిరి కళ్యాణము బొట్టున బెట్టి
మణి బాసికమును నుదుటన గట్టి
పాదాలకు పారాణి బెట్టి ఆ… ఆ… ఆ…
పెండ్లి కుమారై వెలసిన పార్వతి
కళ్యాణము చూతము రారండి
శ్రీశివ పార్వతుల కళ్యాణము చూద్దాము రారండి
6. ఇంపుగ విబూది రేఖలు దిద్ది
సొంపుగ రుద్రాక్ష మాలలు వేసి
అలరుగ పన్నగ భూషణ మేసి ఆ… ఆ… ఆ…
పెండ్లి కొడుకై వెలసిన శివుని
కళ్యాణము చూతము రారండి
శ్రీశివ పార్వతుల కళ్యాణము చూద్దాము రారండి