ఆలోకం వదలి భూలోకం వచ్చినోడా
ఆలికోసం అంతులేని ఆవేదన పోంది నోడా
ఆకాశ రాజు అల్లుడొ గోవిందా
అలమేలు మంగ నాదుడో గోవిందా
గోవిందా గోవిందా – గోవిందా గోవిందా
1. నల్లాని మోము మీద తెల్లని నామాలోడా
కొండల్లో కూర్చొని కోట్లు కూడ బెట్టినోడా
నీ కళ్ళే సూర్య చంద్రులో గోవిందా
ఆలోకం వదలి భూలోకం వచ్చినోడా
ఆలికోసం అంతులేని ఆవేదన పోంది నోడా
ఆకాశ రాజు అల్లుడొ గోవిందా
అలమేలు మంగ నాదుడో గోవిందా
గోవిందా గోవిందా – గోవిందా గోవిందా
2. కలియుగాన పుట్టినీవు శిలారూప మెత్తినోడా
పుట్టలోన దాగినోడా ఆవుపాలు తాగినోడా
నీ నామం మాకు తెలుసురో గోవిందా
ఆలోకం వదలి భూలోకం వచ్చినోడా
ఆలికోసం అంతులేని ఆవేదన పోంది నోడా
ఆకాశ రాజు అల్లుడొ గోవిందా
అలమేలు మంగ నాదుడో గోవిందా
గోవిందా గోవిందా – గోవిందా గోవిందా
3. తిరుపతికి మరిమరి పరపతిని తెచ్చినోడా
మ్రొక్కుబడులు కానుకలు వడ్డీతో గుంజనోడా
విదేశాల యందు నీకు బంగారు గుళ్ళు కట్టినారో గోవిందా
ఆలోకం వదలి భూలోకం వచ్చినోడా
ఆలికోసం అంతులేని ఆవేదన పోంది నోడా
ఆకాశ రాజు అల్లుడొ గోవిందా
అలమేలు మంగ నాదుడో గోవిందా
గోవిందా గోవిందా – గోవిందా గోవిందా
4. ఎంత సొమ్ము కట్టినా వడ్డి ఏ అంటావు
అసలెప్పుడు కడతామురో వెంకన్న
ఆపదలో ఆదుకోరా గోవిందా
ఆలోకం వదలి భూలోకం వచ్చినోడా
ఆలికోసం అంతులేని ఆవేదన పోంది నోడా
ఆకాశ రాజు అల్లుడొ గోవిందా
అలమేలు మంగ నాదుడో గోవిందా
గోవిందా గోవిందా – గోవిందా గోవిందా