కళా నిలయమైన తిరుమలా - వేంకటేశ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar


కళా నిలయమైన తిరుమలా
శిలగ స్వామియున్న కోవెలా
వెలసినాడు వేంకటరమణా భక్త కోటి సన్నుత చరణా
అందమైన హరినారాయణా  పిలిచినంత పలికే పావనా

వెంకటాద్రి శిఖరానా  ఆనంద నిలయానా
శ్రీనివాస నామానా  ఆ జనార్థనా
వెలసియున్న కోవెలా ఆ తిరుమలా
అలరారు స్వామి ఇలా  కోటి కాంతులా
గోవింద గోవింద గోవిందయనగానె
మన గోడు వింటాడుతే మన చెంత నుంటాడులే

వకుళ మాత పుత్రుడు వడ్డీ కాసుల దేవుడు
వామనావతారుడు వాసుదేవుడు
కలియుగమునందునా  కమలనాభుడు
పద్మావతిని వలచినా  దేవదేవుడు
గోవింద గోవింద గోవిందయనగానె
మన గోడు వింటాడుతే మన చెంత నుంటాడులే

వేయి రూపాలతో వేల నామాలతో
వెలుగుచున్న దేవుడు - వేంకటేశుడు
ఆపదలు తీరే శ్రీ అనంతుడు
వేదనలు బాపే వేదాంతుడు
గోవింద గోవింద గోవిందయనగానె
మన గోడు వింటాడుతే మన చెంత నుంటాడులే

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat