పల్లవి :
శంభో శివ శివ శంకరా - పురహర భవహర ఈశ్వరా
హిమగిరి మందిరా - గిరిజా సుందరా
దేవ దేవ దీనబంధు దయనే చూపరా
జయకర శుభకర ఈశా శశి ధరా
|| శంభో ||
చరణం 1:
గరళమే నీ గళమున బంధించిన ఫణి భూషణా
జగములే కాపాడిన దేవా భవ హరణా
సురగణ సంసేవితా ఆశ్రిత జన రక్షకా
నిరతము నీ పూజబ మరువము శుభ చరణా
శరణమే కోరితి - నిను మది వేడితి
సదా శివా హరోం హరా
|| శంభో ||
చరణం 2:
వందనం గంగాధరా అందుకో అభయంకరా
చండికా హృదయేశ్వరా మా సేవలు గైకొనరా
జంగమా అహో లింగమా నీ రూపమే నిర్వికారమా
ఎందును నీవుందువో ఎక్కడ వెదుకమురా
అందరి హృదయాలలో పరమాత్మవు నీవేనురా
సదా శివా హరోం హరా
|| శంభో ||
చరణం 3:
పార్వతి పరమేశ్వరా పంతమే నీకేలరా
సర్వము నీవేనని నమ్మితి కావరా
పరిపరి విధముల తలచితి శుభకరా
వరమువే నొసగరా భక్తవ శంకరా
ధరణిలో నీ దాసుని అప్పన్నను బ్రోవరా
సదా శివా హరోం హరా
|| శంభో ||