జంటముడులు కట్టుకొని - భక్తి వెంట పేట్టుకొని ||కో||
బయలుదేరి పోదామా స్వామి - బయలుదేరి పోదామా స్వామి ||కో||
శరణం శరణ మయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ||కో||
నీకు శరణమయ్యప్పా - మాకు మోక్షమయ్యప్పా||కో||
స్వార్థం పరమార్థం - ముడులక్రింద పేట్టుకొని ||కో||
కామ క్రోధాలను - కులమత భేదాలను||కో||
వదిలిపెట్టి పోవుదామా స్వామి - వదిలిపెట్టి పోవుదామా స్వామి ||కో||
శరణం శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ||కో||
నీకు శరణమయ్యప్పా - మాకు మోక్షమయ్యప్పా||కో||
॥జంటముడులు||
పెద్దపులి వాహనుడ పార్థసారథీ కుమారుడ||కో||మహిషి సంహారిని మణికంఠ రూపుని||కో||
దర్శనమే చేయుదామా స్వామి - దర్శనమే చేయుదామా స్వామి ||కో||
శరణం శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా||కో||
నీకు శరణమయ్యప్పా - మాకు మోక్షమయ్యప్పా||కో||
||జంటముడులు||
పంబలో స్నానమాడి - శరంగుత్తి చేరుకొని||కో||శరణు శరణు శరణంటూ పదినిమిది మెట్లెక్కి ||కో||
అభిషేకం చేయుదామా స్వామిని - అభిషేకము చేయుదామా స్వామిని ||కో||
శరణం శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ||కో||
నీకు శరణమయ్యప్పా - మాకు మోక్షమయ్యప్పా
॥జంటముడులు॥
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
