అయ్యప్ప అన్నదాన ప్రభువు - అనేది మన అందరికీ తెలిసిన విషయమే....
మనం ఎంతో పవిత్రంగా ఇరుముడి కట్టుకొని మన కుటుంబ సభ్యులందరూ తల కొన్ని బియ్యం ఇరుముల్లో పోసి స్వామివారికి మొక్కులు చెల్లించుకునే ఈ బియ్యాన్ని ఎక్కడపడితే అక్కడ వదిలేయడం న్యాయమా.. మీరు పంబలో గాని లేదా ఎరుమేలి లో అన్నదాన క్యాంపుకు లేదా పలని చెంగొట్టై క్యాంపులలో ఈ బియ్యాన్ని ఇచ్చిన వెడల సుమారు 500 మంది ఆకలి తీరుతుంది దయచేసి మీ ఇరుముల్లో బియ్యం అన్నదాన క్యాంపుల్లో ఇవ్వవలసిందిగా కోరుచున్నాము
దయచేసి పంబానదిలో మీ పాత బట్టలు విడిచిపెట్టకండి పంబ నది పరిశుభ్రత మనందరి బాధ్యత లెక్కకు మించి ప్రతిరోజు పంబ నదిలో వ్యర్థ పదార్థాలు స్వాములు విడిచి పెడుతున్నారు దయచేసి పంబా నదిలో బట్టలు కానీ ప్లాస్టిక్ సంబంధించిన ఏ ఇతర వస్తువులు గాని పంబ నదిలో విడిచిపెట్టరాదు. పంబానది పరిశుభ్రత మనందరి ధ్యేయం