విన్నారా అయ్యప్ప / Vinnara Ayyappa - అయ్యప్ప భజన పాటల లిరిక్స్



విన్నారా అయ్యప్ప స్వామి జననం
జగతి కన్నరా శబరిగిరీ దివ్య చరితము (2)
శబరిగీరి వాసుని వైభవం.


సంతతి కనలేక పందళ భూపతి
సత్యం ధర్మం తప్పక పూజలు చేసేనే (2)
ఒకనాడు అడవికి వెడలేను వేటాడ
పొడలేమే పులకించేను పసికందునట చూడ
మనస్సే వికసించ నే మమతే విరభూచనే
మహినే మరిపించేనే
విన్నారా........ వైభవం


భూమాత మెత్తని వడి ఉయ్యాల కాగా
వనదేవత చిరుగాలి వింధ్యా మరలే కాగా
నాగ దేవత పడగ నీడలో హాయిగా
అందాలోలుక పవలించేను ఒక బాలుడు
విన్నారా........ వైభవం


తన్మయుడై రాజు ఆ బిడ్డను  ఎత్తుకొని
తహ తహలాడు రాణి చేతుల్లో పెట్టగానే (2)
తనయుని ముద్దాడి మణికంఠుడను పేరా
తలచిరి దైవాను గ్రహము తను భాగ్యమని
మనస్సే వికసించేనే మమతే విరబూచేనే
విన్నారా అయ్యప్ప స్వామి జననం 

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!