పంపాలో వెలసిన దేవా మహానుభావా - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

 పంపాలో వెలసిన దేవా మహానుభావా॥2॥


జగతికి నీవే దిక్కయ్యా పరుగున నీవు రావయ్యా 

మమ్మాదుకోను రావయ్యా శరణుఘోష వినగా రావయ్యా | 

అయ్యన్ అయ్యప్పవే హరిహర పుత్రుడా ॥2॥ ॥ పంపాలో ॥


విళ్ళాలి వీర రావయ్యా వీరమణికంఠ రావయ్యా 

మమ్మాదుకోను రావయ్యా శరణుఘోష వినగా రావయ్యా |

 అయ్యన్ అయ్యప్పవే హరిహర పుత్రుడా ॥2॥॥ పంపాలో ॥


అన్నదాన ప్రభువా రావయ్యా ఆపద్భాంధవ రావయ్యా

 మమ్మాదుకోను రావయ్యా శరణుఘోష వినగా రావయ్యా | 

అయ్యన్ అయ్యప్పవే హరిహర పుత్రుడా ॥2॥ ॥ పంపాలో ॥


మహిషీ మర్ధన రావయ్యా మోహనరూపా రావయ్యా | 

మమ్మాదుకోను రావయ్యా శరణుఘోష వినగా రావయ్యా | 

అయ్యన్ అయ్యప్పవే హరిహర పుత్రుడా ॥2॥ ॥ పంపాలో ॥


కలియుగ వరదా రావయ్యా మమ్మాదుకోను రావయ్యా

 కరుణామూర్తి రావయ్యా శరణుఘోష వినగా రావయ్యా |

అయ్యన్ అయ్యప్పవే హరిహర పుత్రుడా ॥2॥ ॥ పంపాలో ॥


జ్యోతి స్వరూపా రావయ్యా మకర జ్యోతీ రావయ్యా 

మమ్మాదుకోను రావయ్యా శరణుఘోష వినగా రావయ్యా |

అయ్యన్ అయ్యప్పవే హరిహర పుత్రుడా ॥ 2 ॥


పంపాలో వెలసిన దేవా మహానుభావా ॥ 2 ॥


జగతికి నీవే దిక్కయ్యా  పరుగున నీవు రావయ్యా

మమ్మాదుకోను రావయ్యా శరణుఘోష వినగా రావయ్యా |

అయ్యన్ అయ్యప్పవే హరిహర పుత్రుడా




#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!