శ్రీ మాత శ్రీ తులసి రామ తులసి - భజన పాటల లిరిక్స్

Listen Song


మా ఇంట వెలసిన మహాలక్ష్మి నీవమ్మా
నీ సేవలను మేము సేతుమమ్మా. :2:

పసుపు కుంకుమలతో నారికేళములతో 
నీ పూజ ఘనముగా చేసెదము తులసమ్మా. :2:.

శ్రీ మాత శ్రీ తులసి రామ తులసి
జయములు మాకివ్వు కృష్ణ తులసి. :2:

గోప ప్రదక్షిణము నీకిస్తినమ్మా
గోవిందు సన్నిధి నాకీయవమ్మా.  :1:

ఒంటి ప్రదక్షిణము నీకిస్తినమ్మా
వైకుంఠ సన్నిధి నాకీయవమ్మా.    :2:

రెండో ప్రదక్షిణము నీకిస్తినమ్మా
నిండైన సంపదను నాకీయవమ్మా.    

శ్రీ మాతా శ్రీ తులసి రామ తులసి 
జయములు  మాకివ్వు కృష్ణ తులసీ.  :2:

మూడో ప్రదక్షిణము నీకిస్తినమ్మా
ముత్తైదువ తనము నాకీయవమ్మా

నాలుగో ప్రదక్షిణము నీకిస్తినమ్మా
నవధాన్య రాశులను నాకీయవమ్మా

శ్రీ మాత శ్రీ తులసి రామ తులసి 
జయములు మాకివ్వు కృష్ణ తులసీ.  :2:

ఐదవ ప్రదక్షిణము నీకిస్తినమ్మా
అయువైదో తనము నాకీయవమ్మా

ఆరో ప్రదక్షిణము నీకిస్తినమ్మా
అత్త గల పుత్రున్ని నాకీయవమ్మా.  

శ్రీ మాత శ్రీ తులసి రామ తులసి 
జయములు మాకివ్వు కృష్ణ తులసీ.  :2:

ఏడో ప్రదక్షిణము నీకిస్తినమ్మా
వేణుని ఏకాంత సేవించనీవమ్మా

ఎనమిదో ప్రదక్షిణము నీకిస్తినమ్మా
యమునిచే భాదలు తప్పించవమ్మా.

శ్రీ మాత శ్రీ తులసి రామ తులసి 
జయములు మాకివ్వు కృష్ణ తులసీ.  :2:

తొమ్మిదో ప్రదక్షిణము నీకిస్తినమ్మా
తోడుగా కన్యలకు తోడీయవమ్మా

పదవ ప్రదక్షిణము నీకిస్తినమ్మా
పద్మాక్షి నీ సేవ నాకీయవమ్మా.     

శ్రీ మాత శ్రీ తులసి రామ తులసి 
జయములు మాకివ్వు కృష్ణ తులసీ.  :2:

ఎవ్వరూ పాడిన ఏ కాశి మరణం
పుణ్య స్త్రీలు పాడ పుత్ర సంతానం
రామ తులసీ లక్ష్మీ తులసీ నిత్యమూ మా ఇంట కొలువై విలసిల్లనీవమ్మా....




#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!