జో లాలీ జో.... జో లాలీ జో.... (2)
ఓ కోయిలమ్మ...సడిచేయబోకమ్మా ..
అలసిన మా అయ్యప్ప స్వామి నిద్దురపోయాడే. (2)
ఇప్పుడే నిద్దురపోయాడే. (జో....)
ముల్లోకములు ఏలే ముద్దు ముద్దుల బాలుడమ్మా
ఇరుముడి ఒకటి ఒకటి చూసి చూసి అలిసెనమ్మా..(2)
నెయ్యభిషేకం చేయగా సేద తీరాడే ..
పద్మాల పరుపున పవళించి ఉన్నడే .(2)
ఇపుడే నిద్దురపోయాడే . (జో....)
కాలిగజ్జ విప్పనేలేదు , చెమట బిందువు ఆరనేలేదు
పూజలొన అయ్యప్ప ఆటను ఆప ఎవరి తరము కాదు . (2)
కన్నెస్వాములాడిన వేళా చిందులేశాడే ..
ఆడి పాడి అందాల బాలుడు అలిసిపోయాడే .. (2)
అందుకే నిద్దురపోయాడే . (జో....)
మా చిన్ని మణికంఠకు అడవిలున్న ఉడతలన్నీ ,
మర్రి చెట్టు ఊడల నడుమ ఉయ్యాలా కట్టెనమ్మ (2)
చిన్ని చిన్ని ఊర పిచ్చుకలు ఉయ్యాలూపంగా
గువ్వ గోరింకమ్మలు జోల పాడంగా (2)
అయ్యప్ప నిద్దురపోవంగా . (Jo)
ఆడించగా తండ్రికి అమ్మ నాన్న అక్కడ లేరు
ఉన్న ఆ హరిహరులు ఎప్పుడు స్వామి చెంతకు రానే రారు (2)
అయ్యకు బంధువులంతా అడవి జీవాలే ..
అయ్యప్ప ఆలనా పాలనా మీరే చూడాలే .(2)
అంత మీరే కావాలే.. (జో....) 2