సాయంకాల సమయంలో....వరాల తండ్రి అయ్యప్ప - భజన పాటల లిరిక్స్

P Madhav Kumar


సాయంకాల సమయంలో సంధ్యా దీపారాదనలో వచ్చేను జ్యోతి రూపాన

వరాల తండ్రి అయ్యప్ప||కోరస్||

స్వామి శరణం శరణం అయ్యప్ప  ||2||


కాళ్లకు గజ్జలు కట్టుకుని

పట్టు పంచను చుట్టుకుని

కంఠాన మణిహార మేసుకుని 

కదిలిండమ్మ మణికంటుడే||కోరస్||

స్వామి శరణం శరణం అయ్యప్ప  ||2||


శ్రీశైల మల్లన్న కొడుకంట

తిరుమల వెంకన్న తనయుడట

లాల పోశను గౌరమ్మ

ఉయ్యాలలుపెను లక్ష్మమమ్మ ||కోరస్||

స్వామి శరణం శరణం అయ్యప్ప  ||2||


విల్లు భాణం పట్టుకుని

పులిపైన బాలుడు వస్తుంటే

కొమ్మ మీది కోయిలమ్మ పాడేనట

పురివిప్పి నెమలమ్మ ఆడేనట||కోరస్||

స్వామి శరణం శరణం అయ్యప్ప  ||2||


కమ్మని పాటలు పాడంగా 

కన్నిస్వాములంతా ఆడంగా

కత్తి , గద , గంటస్వామి వేడంగా

గురుస్వామి దీవెనలు పొందంగా||కోరస్||

స్వామి శరణం శరణం అయ్యప్ప  ||2||


సాయంకాల సమయంలో సంధ్యా దీపారాదనలో వచ్చేను జ్యోతి రూపాన

వరాల తండ్రి అయ్యప్ప||కోరస్||

స్వామి శరణం శరణం అయ్యప్ప  ||2||



ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.

లిరిక్స్ పంపినవారు : 

*వై. వెంకటసుబ్బారెడ్డి స్వామి*





#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat