ఈ జన్మకిది చాలయా (దేవా)
కరుణామయా సాగర
ఇలలో నీవే కళలో నీవే
నీవు లేని చోటే దయా - దేవా ( ఈ జన్మకి ది)
పుత్రులు లేని పందళ రాజు కు
పసి బాలునిగా దొరికి తివయ్యా
సకలా నికలేని జీవుల బ్రతుకున
చిరు వేలగులు చిందించరావా
అలలో నీవే శిలలో నీవే
నీవు లేని చోటే దయా - దేవా ( ఈ జన్మకిది)
నిత్యము నిన్నే కొలిచిన వారికి
సత్యములెన్నో చూపితివయ్య
మదిలో మెదిలే మహిషిని చంపి
ధర్మ మార్గమున నడిపింప రావా
ఝరిలో నీవే దరిలో నీవే
నీవు లేని చోటే దయా - దేవా ( ఈ జన్మకిది)
నీ శరణు ఘోషలో కరిగి పులకించని
మానవ జన్మల బ్రతుకేలా
నీ నామ స్మరణలో మొక్షమొందని
మానవ జన్మ ఏలా
శరణం శబరీష శరణం శబరీష
ఇలలో నీవే కళలో నీవే
నీవు లేని చోటే దయా - దేవా ( ఈ జన్మకి ది)