చిన్ని కృష్ణా చేరరారా చిన్ని నాయనా
కన్నతండ్రి వెన్న యిదిగో వేగరారా
ఉన్న వెన్నంత నీకేను రా
కన్న మన్నేమి తినబోకురా
చిన్ని కృష్ణా చేరరారా చిన్ని నాయనా
కన్నతండ్రి వెన్న యిదిగో వేగరారా
1. గోపికల ఇండ్లదూరి గోల చేయకూ
అల్లరేమి చేయకు
ఎల్లవేళ వల్లగాని కల్లలాడు చూ
నల్లనయ్యా వేదించకూ
నందబాలా ఎందుకో నగుబాట్లు చేయకూ
చిన్ని కృష్ణా చేరరారా చిన్ని నాయనా
కన్నతండ్రి వెన్న యిదిగో వేగరారా
2. ఉట్టిమీది చట్టించి జట్టు గాళ్లతో
వెన్నంత దోచావట
గట్టిగాను పట్టబోతే పట్టుకందక
తప్పించుకున్నావట
చెల్లుబాటు కాదురా చిన్నతనమే మానురా
ఉన్న వెన్నంత నీకేను రా
కన్న మన్నేమి తినబోకురా
చిన్ని కృష్ణా చేరరారా చిన్ని నాయనా
కన్నతండ్రి వెన్న యిదిగో వేగరారా
3. భామలంతా కూడి బావిస్నాన మాడగా
చీరలెతు కెళ్లావట
భక్తితోని భామలంతా మ్రొక్కి వేడగా
కొమ్మెక్కి పోయావటా
చెల్లుబాటు కాదురా చిన్నతనమే మానురా
ఉన్న వెన్నంత నీకేను రా
కన్న మన్నేమి తినబోకురా
చిన్ని కృష్ణా చేరరారా చిన్ని నాయనా
కన్నతండ్రి వెన్న యిదిగో వేగరారా