ఏడుకొండల కొండ ఎచట కానని కొండ - వేంకటేశ భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

ఏడుకొండల కొండ ఎచట కానని కొండ - వేంకటేశ భజన పాటల లిరిక్స్

 

ఏడుకొండల కొండ ఎచట కానని కొండ
వడ్డీకాసుల కొండ బంగారు కొండ
గోవింద గోవింద గోవిందా

కొండపై కొలువుంటివే గోవిందా
ఏడుకొండల కొండ ఎచట కానని కొండ
వడ్డీకాసుల కొండ బంగారు కొండ

దివి నుండి విష్ణువే దిగివచ్చెనీ కొండ
బ్రహ్మాది దేవతలు పూజింతురీ కొండ
తరగొండ వెంగమ్మ హరిని వేడిన కొండ
అన్నమయ్యా గళమెత్తి కరమెత్తి ఆడిపాడిన
కొండ

భక్తజన కోటికి వైకుంఠమీ కొండ
గోవింద నామాల సందడుల ఈ కొండ
పుణ్య తీర్థాలకే పుట్టినిల్లీ కొండ
వేదాలు వల్లించు శిలలున్న ఈ కొండ
ఈ కొండా ఈ కొండా

యాగులకు యొగులకు కల్పతరువీ కొండ
కవులకు గాయకుల కళకండ ఈ కొండ
పుణ్య తీర్థాలకే పుట్టినిల్లీ కొండ
వేదాలు వల్లించు శిలలున్న ఈ కొండ

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow