ఎందుకయ్యా జాగుసేతువు నందివాహన శంకరా శివ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

 

ఎందుకయ్యా జాగుసేతువు  నందివాహన శంకరా
అందుకొన రావయ్య మంగళ హరతిదిగో పురహారా

మందమతితో నిన్ను మరిచిన మాకు గతి నీవే హరా
సుందరేశ్వర నీ పదాలకు వందనము గంగాధరా

ఫాలలోచన పాపయోచన బాల చంద్ర కళాధరా
నీలలోహిత భక్త సేవిత నిత్య మంగళ విగ్రహా
కేల శూలము బట్టి లోకాలేలు దొర నీవేనయా
లీలగా మమ్మేలగా రాజాలవా కరుణామయా

ఎన్ని జన్మలు ఎత్తినానో  నిన్ను చేరక దైవమా
కన్న తండ్రీ దర్శనమ్మిడి కనుల పండుగ సేయవా
ఎన్నటికి నీవాడనో గిరిజేశ  శ్రితమందారమా
విన్నపము లాలించి వేగమె విశ్వనాధా బ్రోవుమా

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat