మంగళమని మంగళమని మంగళ మనరమ్మా
మా తల్లి కనక దుర్గకూ అమ్మా మా తల్లి కనకదుర్గకూ
మది నిండా భక్తి నింపి హారతులిడరమ్మా
మా తల్లి కనకదుర్గకూ అమ్మా మా తల్లి కనకదుర్గకూ
ముత్యాల హారతులు ముదితలంత యివ్వరే
మురిపాల మన కనకదుర్గకూ
రతనాల హారతులు రమణులంత యివ్వరే
రమణీలలామ కనకదుర్గకూ
పట్టూ చీరెల నిచ్చి పూవులు గాజుల నిచ్చి
పసుపు కుంకాల పూజ చేయరే
అత్తారు పన్నీరు అగరు గంధము తోటి
పరిమళాల జల్లులు చిలికించరే
కనకా పళ్ళెర మందు ద్రాక్షా నారింజ పనస
తీయని మామిడి పళ్ళను ఉంచరే
పులిహోర క్షీరాన్నము గారెలు బొబ్బట్లు చేసి
ఘనముగ నైవేద్య మిచ్చి వేడరే
బంగరు ఊయలగట్టి బంగారు తల్లికి
పవళింపు జోల పాడరే
అమ్మకు పవళింపు జోల పాడరే