అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప
అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప
అరియం గాపు అయ్యవే శరణం అయ్యప్ప
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
శబరిగిరీశ అయ్యప్ప
శ్రీ ధర్మ శాస్త్ర అయ్యప్ప
వన్ పులి వాహన అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప
విల్లాలి వీరనే అయ్యప్ప
వీర మనికంటనే అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
హరిహరపుత్ర అయ్యప్ప
కానన వాస అయ్యప్ప
సద్గురు నాద అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
పంబా వాసా అయ్యప్ప
కర్పూరదీపం అయ్యప్ప
నీ దివ్య రూపం మా కప్ప
శరణం శరణం అయ్యప్ప
పల్లిం కట్టు శబరిమలక్కు కల్లుం ముల్లుం కాలికి మేత్తే
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
కార్తిక మాసం మాలలు వేసుకొని మండల దీక్షలు చేసి తిమా
మండల పూజలు ముగిసిన పిదప స్వామి యాత్రలో సా గేదమా
ఎరుమేలి చేరి తీమా వావరూ స్వామిని చూసితీమా
పెటైతుళ్లి ఆటలు ఆడి అలుదా నదినే చేరుదమా
అల్లుడా నదిలో స్నానము చేసి రాళ్ళను రెండు తీ సేదమా
కలిడం కుండ్రేలో రాల్లను వేసి కరి మల కొండకు సాగుదమా
కరిమల ఎట్రం కటినం కటీనం స్వామియే శరణం కొరితిమా
దేహబలంద పా దబలంద స్వామి నామమే తలచితిమా
అలసిన భక్తుల సేదతీర్చగా అదిగో వచ్చాను అయ్యప్ప
చేయి పట్టుకొని నడిపింప కరిమల ఏట్రం దాటి తిమా
పెరియాన వట్టమే దాటితిమా చేరియాన వట్టం చేరితి మా
పంబా తీరము చేరితిమా పవళింపు సేవ చేయుదమా
ఉత్సాహంతో ఉరుకుతూ పెరుగుతూ నీలిమలై చేరితిమా
శబరి పీఠమే చేరితిమా శబరికి వందనం చేసేదమా
శబరి కి వందనం చేసిన పిదప శరంగుత్తి నే చేరితి మా
శరంగుత్తి లో శరములు గుచ్చి సన్నిధానము చే రేదమా
పదునెట్టాంబడి చెరితిమా కొబ్బరికాయను కొట్టితిమా
మెట్టు మెట్టుకు మొక్కితి మా స్వామి రూపమే చూచితిమా....