Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

అమ్మ - అమ్మకిదే పూజా పాద పూజా - అమ్మవారి భజన పాటల లిరిక్స్


అమ్మ - అమ్మకిదే పూజా పాద పూజా
దుర్గమ్మ తల్లికిదే పాద పూజా
మంచి మనసుతో చేసే మల్లెల పూజా

కలకాలం అమ్మకిదే కనకాంబర పూజా
చేయి వదల రాదని చేమంతుల పూజా
దయతలచే తల్లికీ దవళాల పూజా
మహా మేరు నిలయినికి మందారాల పూజా

గుడిలోని తల్లికి గులాబీల పూజా
సకల రూప ధారిణిని సంపంగుల పూజా
మంగళాదాయినికి మాలతీల పూజా
బంగారు తల్లికిదే బంతి పూల పూజ

లీలా వినోదినికి లిల్లీ పూల పూజా
కను విందులు చేసేటి కమలాల పూజా
దిగి వచ్చిన మాతకిదే దీపాల పూజా
జాలిగల్ల తల్లికిదే జాజి పూల పూజా

📢 Follow