కైలాసమే కాపురమా / Kailasame kapurama - శివ భజన పాటల లిరిక్స్


హర హర హర హర హర హర హర హర మహదేవా

శివ శివ శివ శివ శివ శివ శివ శివ మహదేవా


కైలాసమే కాపురమా - శ్రీశైలం సింహద్వారమా

వెండికొండపై నివాసముండే ఓనా మల్లన్నా

ఓనా మల్లన్న మెడలో నాగుల మల్లన్నా


ఒక ప్రక్క గణపయ్య మరోపక్క మురుగయ్య

ఇద్దరు కొడుకుల ముద్దుల తండ్రివి  నీవే మల్లన్న

!!భోళా మల్లన్నా!! కైలాసమే

 

తల పైన గంగమ్మ పక్కనేమో పార్వతమ్మ,

ఇద్దరి భార్యల ఇష్ట దేవుడవు నీవే మల్లన్న  

!!భోళా మల్లన్నా!! కైలాసమే

 

పులిచర్మము ధరియించిబిక్షాటన చేశావు

వల్లకాటిలో నివాసముండే విభూతి మల్లన్నా

!!భోళా మల్లన్నా!! కైలాసమే

గరళాన్ని గోతులో దాచిన గరళా కంటుడవు నీవే

ఆది అంతముల లయకారకుడవు నీవే మల్లన్న

!!భోళా మల్లన్నా!! కైలాసమే


శిగపైన గంగమ్మ ఒకపక్క నెలవంక మంచుకొండపై నివాసముండె ఓనా మల్లన్నా ఓనా మల్లన్న మెడలో నాగుల మల్లన్నా


ఒక ప్రక్క గౌరమ్మ మరోపక్క వీరభద్రుడు విభూది కొండపై నివాసముండే ఓనా మల్లన్నా ఓనా మల్లన్న మెడలో నాగుల మల్లన్నా


పులిచర్మము ధరియించి పర్యాటన చేశావు వల్లకాటిలో నివాసముండే ఓనా మల్లన్నా ఓనా మల్లన్న మెడలో నాగుల మల్లన్నా

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!