రావా దుర్గమ్మ - భజన పాటల లిరిక్స్


రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్ళలోకి,

రవ్వల పందిళ్ళలోన ముత్యాలముగ్గులేసి 

ముత్యాల ముగ్గులోన రతనాల రాశిపోసి

రతనాల రాశిపైన పీఠమే వేసినాము

రావా రావా - రావ, రావ, రావ, రావ ॥రావా దుర్గమ్మ!! 


ఎర్రమాల వేసినాము ఎర్రబట్ట కట్టినాము 

ఉదయసంధ్య వేళలోన స్నానాలే చేసినాము -

పసుపు, కుంకుమతో పూజలెన్నో చేసినాము - 

రావా - రావ, రావ, రావ, రావ ॥రావా


రావా మల్లెపూలు తెచ్చినాము మాలలే వేసినాము 

వేపాకులు తెచ్చినాము - తోరణాలు కట్టినాము 

మేళ తాళాలతోటి - భజనలే చేసినాము

రావా రావా రావ, రావ, రావ, రావ || రావా దుర్గమ్మ||


మంత్ర తంత్రాలతోటి పూజలే చేసినాము - 

పులిహోర పొంగళ్లు నైవేద్యం పెట్టినాము -

కర్పూరం వెలిగించి హారతులే ఇచ్చినాము

రావా రావారావా, రావ, రావ, రావ ॥రావా దుర్గమ్మ |



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!