గానం : డప్పుశ్రీను గురుస్వామి
*పల్లవి :*
దండాలమ్మో దండాలమ్మో మాలికాపురత్తమ్మ దండాలమ్మా ||2||
*చరణం :*
కన్నెస్వాములోస్తారు - దండాలమ్మా కత్తిస్వాములోస్తారు - దండాలమ్మా గంటస్వాములోస్తారు - దండాలమ్మా తల్లి గదస్వాములోస్తారు - దండాలమ్మా
కన్నెస్వాములోస్తారు , కత్తిస్వాములోస్తారు , గంటస్వాములోస్తారు , గదస్వాములోస్తారు
॥దండాలమ్మో॥
*చరణం 2 :*
ఎరుమేలిచేరుతారు - దండాలమ్మా
పేటతుళ్ళి ఆడతారు - దండాలమ్మా
అళుదలోన మునుగుతారు - దండాలమ్మా
కరిమలే ఎక్కుతారు - దండాలమ్మా
ఎరుమేలి చేరుతారు , పేటతుళ్ళి ఆడుతారు , అళుదలో మునుగుతారు , కరిమలే ఎక్కుతారు ,
॥దండాలమ్మో॥
*చరణం : 3*
పంబలోన స్నానమాడి - దండాలమ్మా
నీలిమల ఎక్కుతారు - దండాలమ్మా
18 మెట్లనెక్కి - దండాలమ్మా అయ్యనే చూస్తారు - దండాలమ్మా
పంబలోన స్నానమాడి , నీలిమలై దాటుకోని ,
18 మెట్లనెక్కి ,
అయ్యనే చూస్తారు
॥దండాలమ్మో॥
*చరణం : 4*
పసుపే తెస్తారు - దండాలమ్మా కుంకుమే తెస్తారు - దండాలమ్మా
రవికలే తెస్తారు - దండాలమ్మా గాజులే తెస్తారు - దండాలమ్మా
పసుపే తెస్తారు ,
కుంకుమే తెస్తారు ,
రవికలే తెస్తారు ,
గాజులే తెస్తారు
॥దండాలమ్మో॥
దండాలమ్మో దండాలమ్మో
మాలికాపురత్తమ్మ దండాలమ్మ
దండాలమ్మో దండాలమ్మో
మాలికాపురత్తమ్మ దండాలమ్మ
మాలికాపురత్తమ్మ దండాలమ్మ
మాలికాపురత్తమ్మ దండాలమ్మ
మాలికాపురత్తమ్మ దండాలమ్మ
మాలికాపురత్తమ్మ దండాలమ్మో
మాలికాపురత్తు మంజు మాతావే..
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
లిరిక్స్ పంపినవారు :
*వై. వెంకటసుబ్బారెడ్డి స్వామి*