దండాలమ్మ దండాలు తల్లి భవాని మాతా దండాలు - అమ్మవారి భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

దండాలమ్మ దండాలు తల్లి భవాని మాతా దండాలు

అమ్మలగన్న మాయమ్మ మూలపుటమ్మవు నీవమ్మ||2||

అమ్మ మాయమ్మ భవాని దుర్గమ్మ       ||2||


ఓరుగల్లులో వెలసితివా - నీవు భద్రకాళివై నిలిచితివా 

భద్రకాళివై నీవు వెలసిన తల్లి - భయమును తొలగించ రావమ్మా 

అమ్మ మాయమ్మ భవాని దుర్గమ్మ        ॥2॥


వాడవాడలో వెలిసితివా - నీవు విజయవాడలో నిలిచితివా        ||2|| విజయవాడలో నిలిచిన తల్లి విజయము చేకూర్చగా రావమ్మా

అమ్మ మాయమ్మ భవాని దుర్గమ్మ         ||2||


కాంచిపురములో వెలసితివా - కామాక్షివై నీవు నిలిచితివా

కామాక్షివై నీవు నిలిచిన తల్లీ - నీవు కరుణించగ రావమ్మా.

అమ్మ మాయమ్మ భవాని దుర్గమ్మ        ॥2॥ 


మధుర పురిలో వెలిసితివా - నీవు మీనాక్షివై నిలచితివా 

మీనాక్షివై నీవు నిలచిన తల్లీ - దయ చూపగ రావమ్మా 

అమ్మ మాయమ్మ భవాని దుర్గమ్మ ॥2॥


అమ్మ ఓంకార రూపిని నీవమ్మా తల్లి శక్తి స్వరూపిని నీవమ్మా

జగములనేలే తల్లివి నేవే జగన్మాతవునీవమ్మా||అమ్మ||


కలకత్తాపురిలో వెలసితివా - నీవు మహంకాళివై నిలిచితివా

మహంకాళివై నిలిచిన తల్లి  నీవు వరము లివ్వగరావమ్మా

అమ్మ మాయమ్మ భవాని దుర్గమ        ||2||


కడప నగరంలో వెలసితివా నీవు విజయదుర్గవై నిలచితివా

విజయదుర్గవై వెలసిన తల్లి విజయము చేకూర్చగ రావమ్మా. 

అమ్మ మాయమ్మ భవాని దుర్గమ్మ       ||2||



ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.

లిరిక్స్ పంపినవారు : 

*వై. వెంకటసుబ్బారెడ్డి స్వామి*






   

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat