మొదటి పూజ నీకు ముల్లోకాలకు - వినాయక భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

ఓ.....  ఓ......  ఓ......

భువిలోన నీ మోము శతకోటి రూపాలు వెలుగుల్లు విరజిమ్మే నీ బొజ్జ రూపంబు వేడితినయ్యా ఓ ఏకాదంత నరులకు సురులకు దేవుడవయ్య


మొదటి పూజ నీకు ముల్లోకాలకు రావా భువిచేర ఓ గణపయ్య
ఘల్లు ఘల్లున రా గణేశ ఘనమైన పూజలు నీకయ్య
ఘల్లు ఘల్లున రా గణేశ ఘనమైన పూజలు నీకయ్య


శివగంగ గౌరీ ముద్దుల తనయుడ.. ముల్లోకాలేలేటి ముక్తి ప్రదాత
ఘల్లు ఘల్లున రా గణేశ ఘనమైన పూజలు నీకయ్య
ఘల్లు ఘల్లున రా గణేశ ఘనమైన పూజలు నీకయ్య

భాద్రపద మాసమున శుక్లపక్ష చవితిన శుద్ధిగా మేము, శ్రద్ధతో కొలువగా శుద్ధిగా మేము శ్రద్ధతో కొలువగా


పండ్లు పాయశములు పంచ భక్ష ఫలహారము
కుడుములు ఉండ్రాళ్లతో మొట్టమొదటి పూజ
కుడుములు ఉండ్రాళ్లతో మొట్టమొదటి పూజ

ఒకసారి వేడగా వేయిసార్లు చూడ , ఒకసారి వేడగా వేయిసార్లు చూడ
అందరిని దీవించు అందమైన దేవ

ఘల్లు ఘల్లున రా గణేశ ఘనమైన పూజలు నీకయ్య
ఘల్లు ఘల్లున రా గణేశ ఘనమైన పూజలు నీకయ్య


తల్లిదండ్రులను మించిన దైవము జగమున లేరంటు చాటినావు దేవ
జగమున లేరంటూ చాటినావు దేవ


అహంకారమున్న అజ్ఞాన దీనుల కళ్లు తెరిపించి కరుణించ రావా
కళ్లు తెరిపించి కరుణించ రావా


దిన దినము వేడ దైవాంశ సంభూతుడ
దిన దినము వేడల దైవాంశ సంభూతుడ

దయగల దేవ దరిచేర రావా
ఘల్లు ఘల్లున రా గణేశ ఘనమైన పూజలు నీకయ్య


ఘల్లు ఘల్లున రా గణేశ ఘనమైన పూజలు నీకయ్య
లోకము నిను ధ్యానిస్తే పాపము హరియించేవు

లోకాలనేలేటి శివగంగా పుత్రుడ
లోకాలనేలేటి శివగంగా పుత్రుడ


శ్లోకాలను జపియిస్తే శోకాలు మాపేవు
శుభము ప్రసాదించే సుర పూజిత దేవుడ
శుభము ప్రసాదించే సుర పూజిత దేవుడ


నీ నామ గానం నీ ధ్యాన భజనం
నా నామ గానం నీ ధ్యాన భజనం
మా వెంట నీవుంటే మా పాలిట దైవం

ఘల్లు ఘల్లున రా గణేశ ఘనమైన పూజలు నీకయ్య
ఘల్లు ఘల్లున రా గణేశ ఘనమైన పూజలు నీకయ్య

ముల్లోకాలేలేటి ముక్తి ప్రదాత
ఘల్లు ఘల్లున రా గణేశ ఘనమైన పూజలు నీకయ్య
ఘల్లు ఘల్లున రా గణేశ ఘనమైన పూజలు నీకయ్య



ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.



లిరిక్స్ పంపినవారు: 
*వై. వెంకటసుబ్బారెడ్డి స్వామి*

*గానం: నార్సింగి నర్సింగ్ రావు గురుస్వామి*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat