శుక్లాం బరధరం శశివర్ణం చతుర్భుజం
శుక్లాం బరధరం శశివర్ణం చతుర్భుజం
శుక్లాం బరధరం శశివర్ణం చతుర్భుజం
ఎలుక వాహన ఏనుగు రూప పార్వతి తనయా గజానన
ఏలుకొందువని వేడుకుంటిరా ఏలగ రారా గజాననా
ఏలుకొందువని వేడుకుంటిరా ఏలగ రారా గజాననా
॥శుక్లాం బరధరం||
భాద్ర పదంబున చవితి పూజలు అందుకొనగ దిగి రావా స్వామి
పత్రిపూజలు పాయశాన్నములు అందుకొని మము ఆదుకొనగరా
పత్రిపూజలు పాయశాన్నములు అందుకొని మము ఆదుకొనగరా
॥శుక్లాం బరధరం॥
భువిలో దివిలో ఏడులోకాల ముందు పూజలు నీకేనయ్య
తల్లిదండ్రులను మించిన దైవం లేదని చాటిన తనయుడవయ్యా
తల్లిదండ్రులను మించిన దైవం లేదని చాటిన తనయుడవయ్యా
॥శుక్లాం బరధరం||
భవ బంధాలను బాపగ నీవు బావిలో వెలసిన దేవుడవయ్య
కరుణామూర్తి కానగ రావ కాణిపాక ఓ వినాయక
కరుణామూర్తి కానగ రావ కాణిపాక ఓ వినాయక
॥శుక్లాం బరధరం||
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి
లిరిక్స్ పంపినవారు:
*వై. వెంకటసుబ్బారెడ్డి స్వామి*
*వై. వెంకటసుబ్బారెడ్డి స్వామి*
*గానం: గంగపుత్ర నర్సింగ్ రావు గురుస్వామి*