Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

చిన్నీ చిన్నీ గణపతి మా చిన్నీ ముద్దుల గణపతి - వినాయక భజన పాటల లిరిక్స్

చిన్నీ చిన్నీ గణపతి మా చిన్నీ ముద్దుల గణపతి 

అందాచందల గణపతి నీకు ముందుగ పూజలు గణపతి  

॥చిన్నీ చిన్నీ॥

మూషిక వాహన మోదుక హస్తా మోహన రూపా గణపతి 
కైలాస వాసా గణపతి కరుణించగ రావా గణపతి 

ఎలుక నెక్కి ఏడేడు లోకాలు ఏలేటి నా తండ్రి గణపతి
వెండి కొండలు దాటి భూలోకమొచ్చిన భక్తుల దైవం నీవయ్య 

॥చిన్నీ చిన్నీ॥

వెండి కొండలు దాటి భూలోకమొచ్చిన భక్తుల దైవం నీవయ్య 
పత్రి పూజలు పాయశాన్నములు ముందుగ నీకే రావయ్య

పత్రి పూజలు పాయశాన్నములు ముందుగ నీకే రావయ్య 
మొక్కులు మొక్కేము ఓ దేవ మా దిక్కువు నీకే మహదేవ

మొక్కులు మొక్కేము ఓ దేవ మా దిక్కువు నీకే మహదేవ
కాణిపాకమందు బావిలో వెలసిన బంగార దైవం నీవయ్య

॥చిన్నీ చిన్నీ॥

తల్లిదండ్రులను మించిన దైవం లేదని చెప్పిన వాడవు
తల్లిదండ్రులను మించిన దైవం లేదని చెప్పిన వాడవు

చుక్క పొద్దున లేచేము నీకు ఒక్క పొద్దులే పట్టేము
చుక్క పొద్దున లేచేము నీకు ఒక్క పొద్దులే పట్టేము

భక్తితో వేడేము గణపయ్య మాకు ముక్తిని ఇవ్వగ రావయ్య
భక్తితో వేడేము గణపయ్య మాకు ముక్తిని ఇవ్వగ రావయ్య
ముక్కోటి దేవుళ్ల కన్నా గణపయ్య ముందు పూజలు నీకేనయ్య

॥చిన్నీ చినీ

ఈ పాటను ఎలా వాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.

లిరిక్స్ పంపినవారు: 
*వై. వెంకటసుబ్బారెడ్డి స్వామి*
*గానం: భాస్కరాచారి గురుస్వామి*

📢 Follow