రామ రామ స్వామి అయ్యప్ప
తూరుపు దేశం పోదామా తుమ్మిపూలు తెస్తామా
తెచ్చి అయ్యప్పకిస్తామా అయ్యప్ప భజనలు చేస్తామా
తెచ్చి అయ్యప్పకిస్తామా అయ్యప్ప భజనలు చేస్తామా
||రామ||
పడమట దేశం పోదామా పండ్లు మల్లెలు తెస్తామా
తెచ్చి అయ్యప్పకిస్తామా అయ్యప్ప భజనలు చేస్తామా
తెచ్చి అయ్యప్పకిస్తామా అయ్యప్ప భజనలు చేస్తామా
తెచ్చి అయ్యప్పకిస్తామా అయ్యప్ప భజనలు చేస్తామా
చూచి శరణాలు చెపుదామా నెయ్యభిషేకము చేద్దామా
అయ్యప్ప నామము దొరికినది మన కష్టాలన్నీ తీరినవి
అయ్యప్ప నామం మధురమయా అయ్యప్పనామం చెప్పవయా
తెచ్చి అయ్యప్పకిస్తామా అయ్యప్ప భజనలు చేస్తామా
||రామ||
ఉత్తరదేశం పోదామా ఉమ్మిపూలు తెస్తామా తెచ్చి అయ్యప్పకిస్తామా అయ్యప్ప భజనలు చేస్తామా
||రామ||
దక్షిణదేశం పోదామా తామరపూలు తెస్తామా తెచ్చి అయ్యప్పకిస్తామా అయ్యప్ప భజనలు చేస్తామా
||రామ||
కేరళదేశం పోదామా అయ్యప్ప స్వామిని చూద్దామా చూచి శరణాలు చెపుదామా నెయ్యభిషేకము చేద్దామా
||రామ||
అయ్యప్ప నామము దొరికినది మన పాపాలన్ని తొలగినవి అయ్యప్ప నామము దొరికినది మన కష్టాలన్నీ తీరినవి
అయ్యప్ప నామం మధురమయా అయ్యప్పనామం చెప్పవయా
||రామ||