రాజా రాజా పందల / Raja Raja Pandala - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
1 minute read
రాజా రాజా పందల రాజా
నిన్ను పంపానది తీరాన కీర్తించేము (2)
శరణం అయ్యప్ప శరణం స్వామి
స్వామి అయ్యప్ప శరణం స్వామి
అన్నదాన ప్రభువా శరణం స్వామి
పొన్నంబలవాస శరణం స్వామి


అలుధపంబ జలములొని తీపిని నీవే
అడవి లోన జీవాల ఆటవు నీవే
బంగారు కొండ పైన వేదం నీవే
 పంచ గిరులు ధ్వనియించె నాదం నీవే
శరణం అయ్యప్ప శరణం స్వామి
స్వామి అయ్యప్ప శరణం స్వామి 


భూత దయను భోదించిన కరుణామూర్తి
భూత నాద సధానంద శాంతమూర్తి
ఇంద్రియములు జయించిన సుందరమూర్తి
ఇడుములను కడతేర్చే దివ్య మూర్తి
శరణం అయ్యప్ప శరణం స్వామి
స్వామి అయ్యప్ప శరణం స్వామి
అన్నదాన ప్రభువా శరణం స్వామి
పొన్నంబలవాస శరణం స్వామి


వావరున్ని వాల్మికిగా మలచినావయ
వనము లోని ఘణముగా నిలిపినావయ
గురు పుత్రుని కరుణించిన శ్రీగురునాధ
మా నయనములు పలుకులు నివేకాదా
శరణం అయ్యప్ప శరణం స్వామి
స్వామి అయ్యప్ప శరణం స్వామి
అన్నదాన ప్రభువా శరణం స్వామి
పొన్నంబలవాస శరణం స్వామి


తల్లి తండ్రులు పూజించు నిభావనలు
గురువులను గౌరవించు నిసేవలు
కలియుగమును రక్షించె అభయ హస్తము
ఓ తండ్రి నివేలే మా సమస్తము
శరణం అయ్యప్ప శరణం స్వామి
స్వామి అయ్యప్ప శరణం స్వామి
అన్నదాన ప్రభువా శరణం స్వామి
పొన్నంబలవాస శరణం స్వామి


రాజా రాజా పందల రాజా
నిన్ను పంపానది తీరాన కీర్తించేము (2)

శరణం అయ్యప్ప శరణం స్వామి
స్వామి అయ్యప్ప శరణం స్వామి (2)


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat